ప్రతి మదిలోనూ నీ జ్ఞాపకాలే ... | Memoirs of ys rajasekhara reddy | Sakshi
Sakshi News home page

ప్రతి మదిలోనూ నీ జ్ఞాపకాలే ...

Published Sun, Sep 2 2018 8:19 AM | Last Updated on Sun, Sep 2 2018 8:19 AM

Memoirs of ys rajasekhara reddy  - Sakshi

రుణమాఫీతో రైతులను అప్పుల నుంచి గట్టెక్కించావు.. జలయజ్ఞంతో బీడు భూములకు సాగునీటి ఆదరవు కల్పించావు.. అపర భగీరథుడిగా పేరు సంపాదించావు.. 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలతో ఆరోగ్య భరోసా కల్పించావు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువులకు సాయం చేశావు.. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచావు.. బతుకుపై ఆసరా కల్పించావు.. నీవు మా నుంచి దూరమైనా నీ జ్ఞాపకాలు ప్రతి మదిలోనే పదిలంగానే ఉన్నాయి. నీవు నిర్మించిన ప్రాజెక్టులు మా పంటలకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తున్నాయి. నిను ఎప్పటికీ మరచిపోలేం రాజన్నా... మా గుండెల్లో నీ గుడికట్టుకున్నాం అంటూ జిల్లావాసులు పేర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతి(ఆదివారం)ని పురస్కరించుకుని ఆయన మేలును గుర్తుచేసుకుంటున్నారు. జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. అలాంటి పాలన కావాలని ఆకాంక్షిస్తున్నారు.  

విజయనగరం గంటస్తంభం/సాలూరురూరల్‌/కొమరాడ/గరుగుబిల్లి: రైతు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మిన గొప్పనేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. పాడిపంటలు విలసిల్లిన చోట ప్రజలు సంతోషంగా ఉంటారన్నది ఆయన నమ్మకం. అందుకే ఆయన పాలనలో రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. పంటలు సాగుకు శాశ్వతంగా సాగునీరందించేందుకు జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణానికి పెద్దపీట వేశారు. జిల్లాలో కీలక సాగునీటి ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మించినవే. జిల్లాలో సుమారు 1.6 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టులను నిర్మించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జలయజ్ఞ ఫలాలు గురించి ఓ సారి గుర్తు చేసుకుంటే..

పెద్దగెడ్డతో సస్యశ్యామలం 
వై.ఎస్‌.ఆర్‌ పెద్దపీట వేసి పూర్తి చేసిన మరో ప్రాజెక్టు పెద్దగెడ్డ. పాచిపెంట మండలంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు ఇప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి పనులు చేయకుండా వదిలేశారు. వైఎస్సార్‌ సీఎం కాగానే ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించి అవసరమైన నిధులు మం జూరు చేస్తూ 2004 లో పరిపాలన అనుమతులు ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించడమే కాకుండా రూ.100 కోట్లతో ఏడాదిన్నరలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. 2006 సెప్టెంబర్‌లో ప్రాజెక్టు ప్రారంభోత్సం చేసి జాతికి అంకితం చేశారు. జలయజ్ఞం కింద రాష్ట్రంలో మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. జలాశయం నుంచి వైఎస్సార్‌ నీరు విడుదల చేశారు. దీంతో పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో 12వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరింది. ఫలితంగా ఆప్రాంతం పులకిరించింది. ఇప్పుడు రైతులు పంటలకు భరోషా కల్పించి గొప్పనేతగా ముద్ర వేయించికున్నారు. 

 విద్యార్థులకు లబ్ధి
విజయనగరం పూల్‌బాగ్‌: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగేళ్ల కాలంలో 2 లక్షల 40 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు. కార్పొరేట్‌ విద్యను అందుకోగలిగారు. లక్షా 91 వేలు మంది బీసీ విద్యార్థులు, 30 వేలమంది ఎస్సీ విద్యార్థులు, 18 వేల మంది ఎస్టీ విద్యార్థులకు లబ్ధిచేకూరింది.

జంఝావతికి ఒక పరిష్కారం
నాగావళి ఉపనది జంఝావతిలో ఏడాదికి 12టీఎంసీలు నీరు ప్రవహిస్తోంది. ఇందులో 8 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి. అందులో ఒడిశాకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 4టీఎంసీలు కేటాయిస్తూ కేంద్ర జలమండలి స్పష్టం చేసింది. అయితే ఆనికర జలాలను వాడుకునే పరిస్థితి లేదు. కొమరాడ మండలంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి జిల్లాలో 24,640 ఎకరాలకు నీరు ఇవ్వాలని 1976లో పనులు ప్రారంభించారు. కానీ ఒడిశాతో ఉన్న అంతరరాష్ట్ర వివాదంతో ఈ పనులు ముందుకెళ్లక నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుంది. 2004 వరకు దీనికి ఏ ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. అప్పుడు అధికారంలో వచ్చిన వైఎస్‌ ఏదో ఒక ఆలోచన చేసి నీరు వాడుకోవాలన్న ఉద్దేశంతో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో రబ్బరుడ్యాం నిర్మించాలని తలపెట్టి విజయవంతమయ్యారు. ఆయన చొరవతో 2006లో రబ్బరు డ్యాంను ఏర్పాటు చేసి లోతట్టు కాలువు ద్వారా నీరందించే ప్రయత్నం చేశారు. ఫలితంగా జంఝావతి ప్రాజెక్టు ఇంకా వివాదంలోనే ఉన్నా ఆయన ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాం వల్ల ప్రస్తుతం 8 వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం కలిగింది. ఫలితంగా అక్కడ రైతుల్లో ఆయన దేవుడుగా మిగిలిపోయాడు. 

పరుగులు తీసిన తోటపల్లి
జిల్లాలో ఉన్న భారీతరహా సాగునీటి ప్రాజెక్టు తోటపల్లి. ఈ ప్రాజెక్టుకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయకపోయినా పనులు మాత్రం ఆయన కాలంలోనే ప్రారంభయ్యాయి. పాత ఆయకట్టు 24వేల ఎకరాలతోపాటు కొత్తగా 1.20లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన హయాంలో రూ.450.24 కోట్లతో 2008 జులై 31న జీవో నంబర్‌ 114 జారీ చేశారు. తర్వాత అంచనాలు పెరిగి ప్రస్తుతం అంచనా వ్యయం రూ.750 కోట్లు అయింది. 90శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, ఇందులో రూ.400 కోట్లు నిధులు ఆయన హయాంలో విడుదల చేసి 57శాతం పనులు పూర్తి చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 20 శాతానికిపైగా పనులు చేసింది. చివర్లో ఈ ప్రభుత్వం 10 శాతం పనులు పూర్తి చేసి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం తోటపల్లి కింద వేలాది ఎకరాలకు నీరందుతుందంటే ఆ మహానేత పుణ్యమేనని అక్కడ రైతులు చెప్పుకోవడం వెనుక వైఎస్సార్‌ కృషిని మనమంతా గుర్తించాల్సిందే.

తారకరామ తీర్థసాగర్‌
జిల్లాలో మరో కీలకమైన ప్రాజెక్టు తారకరామ ప్రాజెక్టు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్టు నిర్మాణం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభం కావడం విశేషం. చంపావతి నదిలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపెట్టి మూడు మండలాల రైతులకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టును 2006 వైఎస్సార్‌ ప్రారంభించారు. ఇందుకు 2005లో రూ.220 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చారు. 2009 సెప్టెంబర్‌లో ఆయన మృతి చెందేనాటికి సుమారు రూ.100 కోట్లు కేటాయించి పనులు వేగంగా జరిగేందుకు కృషి చేశారు. దీంతో 20శాతం వరకు పనులు ఆయన కాలంలోనే పూర్తయినా ఆయన ఆకాల మరణంతో ప్రాజెక్టు గతి తప్పింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 10శాతం పనులు చేయగా, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కేవలం 10 శాతం పనులు చేయడంతో రైతులకు సాగునీరు ఇంకా అందలేదు. నిజంగా ఆయన బతికుంటే గత ఎన్నికలకు ముందే రైతులకు నీరందేదనడంలో అతిశయోక్తి లేదు. అక్కడ రైతులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సాంకేతిక విద్యకు పెద్దపీట
జిల్లాలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, ఏయూ క్యాంపస్‌ ఏర్పాటు 
విజయనగరంఅర్బన్‌: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను తీర్చడంలో ప్రాధాన్యమిచ్చారు. ప్రధానంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంలో చొరవ చూపారు. సాంకేతిక విద్యను జిల్లా వాసులకు అందుబాటులో తీవాలనే ప్రయత్నంలో భాగంగా పట్టణ శివారుల్లో  జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలను 2007లో స్థాపించారు. రాష్ట్రంలో మూడు కళాశాలలకు అప్పట్లో అనుమతి ఇస్తే వాటిలో మన జిల్లాకి ఒకటి ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. కళాశాల స్థాపించడం వల్ల బోధన, బోధనేతర సిబ్బంది 260 మందికి ఉపాధి కల్పించారు. ఏడాదికి 360 మంది చొప్పున సుమారు  3 వేల మందికి ప్రభుత్వ కళాశాలల్లో ఇంజనీరింగ్‌ విద్యను అందించించారు. 

ఏ.యూ.క్యాంపస్‌ స్థాపన
ఆర్ట్సు ఉన్నత విద్యను జిల్లా వాసులకు అందించాలనే లక్ష్యంతో పట్టణ శివారులో ఆంధ్రాయూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్‌ క్యాంపస్‌ను 2005లో ప్రారంభించారు. ఉన్నత చదువులకు పెద్దపీట వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement