బీచ్‌రోడ్డులో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నాయకులు
విశాఖసిటీ: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఊరూ వాడా సేవా కార్యక్రమాలతో ఘనంగా నివాళులర్పించారు. మహానేత భౌతికంగా దూరమై తొమ్మిదేళ్‌లైనా తమ గుండెల్లో కొలువై ఉన్నాడంటూ జిల్లా వాసులు కొనియాడారు. పేదలకు వస్త్రాలు, అన్నదానాలు, రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. పలుచోట్ల రక్తదానం చేశారు.
తూర్పు నియోజకవర్గంలో...
తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో 9వ వార్డులో పేదల పండ్లు అందజేశారు. శ్రీకృష్ణాపురంలో పేదలకు నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. సంజయ్‌గాంధీ కాలనీలో వార్డు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దుర్గాబజార్ వద్ద యువ చైతన్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద వృద్ధులకు బియ్యం, పళ్లు అందజేశారు. 10వ వార్డులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆరో వార్డులో వైఎస్సార్ సీపీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, భీమిలి నియోజకవర్గ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి ఆధ్వర్యంలో వుడాకాలనీ బీచ్ రోడ్డు ఆర్చ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు దసపల్లా లేఅవుట్ ప్రాంతాలోని అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఉత్తర నియోజకవర్గంలో..
32వ వార్డు ముస్లింతాటిచెట్లపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ చే ఊ్ఛరు. విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, పార్లమెంట్ మహిళాధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రియదర్శిని హోంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి లలితానగర్‌లో గల కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జగ్గారావు బ్రిడ్జి వద్ద విశాఖ జిల్లాభవన నిర్మాణ కార్మిక సంఘం అధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. 38వ వార్డు పట్టాభిరెడ్డితోటలోని వానప్రస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సమన్వయకర్త కేకే రాజు, ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి షబ్నం అష్రాఫ్ వృద్థులకు పండ్లు పంపిణీ చేశారు.
దక్షిణ నియోజకవర్గంలో...
నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, పార్టీ నాయకుడు జాన్‌వెస్లీ ప్రేమసమాజంలో అనాథ వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పార్టీ మహిళ విభాగం నగర అధ్యక్షురాలు గరికిన గౌరీ ఆధ్వర్యంలో వార్డు పరిధి అచ్చెయ్యమ్మపేట జంక్షన్లో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 29వ వార్డు అధ్యక్షురాలు తోట పద్మావతి వార్డులోని పేదలకు బియ్యం అందజేశారు. వార్డులోని జెండా చెట్టు వీధి(అచ్చెయ్యమ్మపేట)లో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన ఇద్దరు చిన్నారుల(సీహెచ్ వాసంతి, సాయిసుధా)కు ఆర్థిక సాయం చేశారు. విద్యా దానం కింద ఓ పాపను దత్తత తీసుకున్నారు. దొంపర్తిలో కోలా గురువులు, జాన్‌వెస్లీ, నగర మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మహ్మద్ షరిఫ్ చేతుల మీదుగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. జగదాంబలోని వైస్ విగ్రహం వద్ద పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమెరికన్ ఆసుపత్రి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం అందజేశారు. 21వ వార్డులో పేదలకు పండ్లు, చిన్నారులకు పుస్తకాలు, 22వ వార్డులో విద్యార్థులకు పలకలు, సున్నపు వీధిలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. చిలకపేటలో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశారు.
పశ్చిమ నియోజకవర్గంలో..
ఎన్‌ఏడీ జంక్షన్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మహిళలకు కుట్టుమిషన్లు, చీరలు పంపిణీ చేశారు. పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 95 మంది రక్తందానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె.రాజు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 45 నుంచి 49వ వార్డు పరిధిలో గల పేద కుటుంబాలకు చెందిన వితంతువులు సుమారు 20 మందికి కుట్టు మిషన్లు అందించారు. అనంతరం సుమారు 5 వందల పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాధవధారలో వివిధ అనాథాశ్రమాల్లోని అనాథలకు పళ్లు పంచిపెట్టారు.
గాజువాక నియోజకవర్గంలో..
రాజీవ్‌నగర్ జంక్షన్‌లో సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రైవర్స్ కాలనీలో నాగిరెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు పళ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. 500 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 61వ వార్డు అధ్యక్షుడు రాజాన రామారావు వైఎస్ వర్ధంతిని అనాథ పిల్లల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు, అనాథ పిల్లలకు పళ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. 63వ వార్డులో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్‌కు నివాళులర్పించారు. భెల్ (హెచ్‌పీవీపీ)లో వైఎస్ వర్ధంతిని సంస్థ గుర్తింపు యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అగనంపూడి వైఎస్సార్ కూడలి నిరుపేద విద్యార్థి జెర్రిపోతుల రమ్య చదువు కోసం పార్టీ నాయకులు పూర్ణ, ఇల్లపు ప్రసాద్ రూ.5500 నగదును ఆర్థిక సహాయంగా అందించారు.
భీమిలి నియోజకవర్గంలో..
మధురవాడ, స్వతంత్రనగర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కరమాని విజయనిర్మల వైఎస్ విగ్రహం, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చంద్రంపాలెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిరం వద్ద గల వైఎస్ విగ్రహానికి పూల మాలలు నివాళులర్పించారు. సాయిరాం కాలనీలో పార్టీ నాయకులు వృద్ధులకు పండ్లను అందజేశారు. పద్మనాభం, పీఎంపాలెంలో విజయనిర్మల చేతుల మీదుగా దివ్యాం గుల పాఠశాల విద్యార్థులకు యాపిల్ బత్తాయి ఫలాలు పంపిణీ చేశారు. స్కూలుకు నిత్యావసర సరకులు ఆమె అందజేశారు. ఆనందపురం మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు.
పెందుర్తి నియోజకవర్గంలో...
పెందుర్తి పార్టీ కార్యాలయంలో అదీప్‌రాజ్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సబ్బవరం మండలంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో తన మనమడు,షర్మిల తనయుడు అర్జున రెడ్డి పాల్గొన్నారు. ప్రహ్లాదపురంలో పేదలకు పండ్లు, రొట్టెలు పంచారు. నాయుడుతోట జంక్షన్‌లో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అప్పలనరసింహంకాలనీలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. పరవాడ గ్రామంలో సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశపాత్రునిపాలెంలో పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
మనసున్న మారాజు వైఎస్సార్
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌రోడ్డులోని వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మనసున్న మారాజు వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎం.వి.వి. సత్యనారాయణ, సమన్వయకర్తలు వంశీకృష్ట శ్రీనివాస్, కోలా గురువులు, కె.కె. రాజు, నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు ఫరూఖీ, భర్కత్ ఆలీ, ఉషాకిరణ్, రవిరెడ్డి, పక్కి దివాకర్, వెంకటలక్ష్మి, మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, మైనార్టీ సెల్ ఎండీ షరీఫ్, మాజీ కార్పొరేటర్లు పోతిన హనుమంత్, విజయచంద్ర, జాన్ వెస్లీ, పీలా ఉమారాణి, నగర ప్రధాన కార్యదర్శి అచ్చితిరావు, పైలా జ్యోతి, రాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment