సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు, క్షీరాభిషేకాలు చేసి ఘన నివాళులర్పించారు. పలుచోట్ల రక్త, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నేతలే స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వైఎస్సార్ భౌతికంగా దూరమై తొమ్మిదేళ్లవుతున్నా..జనం మాత్రం ఆయన్ను తమ గుండెల్లో పెట్టుకుని నిత్యం పూజిస్తున్నారు. అందుకే ఆయన వర్ధంతి రోజున ఎవరిని కదిలించినా రాజన్న రాజ్యం గురించే చెప్పారు. ఈ దగాకోరు పాలనకు అంతం చెబుతామంటూ ప్రతినబూనారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని ఆపార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షీరాభిషేకాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానాలతో పాటు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ‘అనంత’లో మాజీ ఎంపీ అనంత స్వయంగా రక్తదానం చేశారు. ఉరవకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మడకశిరలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, తాడిపత్రి, అనంతపురంలో ‘అనంత’ పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య పాల్గొన్నారు.
♦ ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కూడేరు మండలం అంతరగంగలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదానం చేశారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వచ్చాయంటే అది వైఎస్ ఘనతే అని కొనియాడారు.
♦ పెనుకొండలో హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై ర్యాలీగా వెళ్లి దర్గా సర్కిల్‌లో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆ మహానేత జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు.
♦ రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటాలనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృభహంలోని ఆ మహానేత విగ్రహానికి పూలమాల వేశారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తర్వాత అన్నదానం చేశారు. ఉపేంద్రరెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి సిద్దప్ప పాల్గొన్నారు.
♦ శింగనమల నియోజకవర్గం పుట్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదానం చేశారు. శింగనమలలో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వైఎస్ విగ్రహం సమీపంలో అన్నదానం నిర్వహించారు.
♦ మడకశిరలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్సార్ సర్కిల్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
♦ గుంతకల్లులో సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. గుత్తిలో కూడా వైఎస్సార్ విగ్రహానికి వెంకట్రామిరెడ్డి పాలాభిషేకం చేశారు. ఆటో కార్మికులు స్వచ్ఛందంగా గుత్తిలోని దారి వెంబడి భోజనం పంపిణీ చేశారు.
♦ పుట్టపర్తి నియోజకవర్గంలో బ్రాహ్మణపల్లి, బుక్కపట్నంలోని వైఎస్సార్ విగ్రహాలకు సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మారాలలో మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
♦ తాడిపత్రిలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య, తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని ప్రారంభించారు.
♦ రాప్తాడులో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తలుపూరులో తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి(చందు) వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కనగానపల్లి మండలం బద్దలాపురం, వేపకుంటలో పార్టీ నేతలు అన్నదానం నిర్వహించారు. రామగిరి మండలం పేరూరులో కూడా వైఎస్ వర్ధంతిని నిర్వహించారు.
♦ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పాల్వాయిలో స్థానిక నేతలతో కలిసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తక్కిన మండల కేంద్రాల్లో మండల కన్వీనర్లు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
♦ ధర్మవరం పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాలుగు వార్డుల్లో అన్నదానం నిర్వహించారు. తాడిమర్రిలో రక్తదానం నిర్వహించారు. పలు గ్రామాల్లో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అన్నదానం నిర్వహించారు.
♦ హిందూపురంలో వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. వైఎస్సార్‌సీపీ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి తన కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. మిట్టమీదపల్లి వద్ద మండల నాయకులు వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. చిలమత్తూరు, లేపాక్షిలో కూడా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
♦ కదిరిలో సమన్వయకర్త సిద్ధారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి పట్టణంలో ర్యాలీగా వైఎస్సార్ విగ్రహానికి చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు.
వైఎస్సార్‌కు ‘లింగాల’ దంపతుల నివాళి
అనంతపురం అగ్రికల్చర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు లింగాల శివశంకరరెడ్డి, ఆయన సతీమణి లింగాల నీరజారెడ్డి నివాళుర్పించారు. స్థానిక డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి మహానేత చేసిన సేవలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు, పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment