తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి | YSR Anniversary Birthday Celebrations In Telugu States | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 12:51 PM | Last Updated on Sun, Jul 8 2018 4:37 PM

YSR Anniversary Birthday Celebrations In Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు ఆ మహానేత నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇడుపులపాయలో జరిగిన జయంతి వేడుకల్లో వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, సోదరి వైఎస్‌ షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

మరోవైపు హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు బొత్స సత్యనారాయణ, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, వాసిరెడ్డి పద్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సంక్షేమానికి వైఎస్‌ జగన్‌ మారు పేరని బొత్స కొనియాడారు. అనంతరం భారీ కేకును కట్‌ చేశారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతలు వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్యార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్యయ్య, షబ్బిర్‌ అలీ, కేవీపీ రామచంద్రరావులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కళ్లూరు మండలం షరిన్‌ నగర్‌లో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేర్నకల్‌ సురేందర్‌ రెడ్డి, రాజా విష్ణు వర్ధన్‌ రెడ్డి, రాంభూపాల్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

పలు సేవా కార్యక్రమాలు
చిత్తూరులో వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా సిఎస్‌ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ అభిమానులు, కార్యకర్తలు భారీ కేక్‌ను కట్‌ చేశారు. గుంటూరు, సత్తెనపల్లిలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం, రైల్వేస్టేషన్ వద్ద మహిళకు చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. వినుకొండలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేశారు.

వైఎస్సార్‌ అనేది పేరు కాదు.. బ్రాండ్‌
విజయవాడ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రోజా సమక్షంలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ అనేది పేరు కాదని.. ఓ బ్రాండ్‌ అని రోజా పేర్కొన్నారు. విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరు వైఎస్సార్‌ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వెల్లంపల్లి, మల్లాది విష్ణు, తోట శ్రీనివాస్‌, బొప్పన భవకుమార్‌, యలమంచిలి రవిలు హాజరయ్యారు. అనంతరం వన్ టౌన్ పంజా సెంటర్‌లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరులో నియోజకవర్గ కన్వీనర్‌ తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

అనంతపురం జిల్లా, చెన్నేకొత్తపల్లిలో వైఎస్‌ఆర్‌ జయంతిని ఆయన అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేశారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. రక్తదానం కార్యక్రమంలో పాటు రోగులకు పండ్లు అందజేశారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం, చీమకుర్తిలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌ టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్‌ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ఆ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మానసిక వికలాంగుల స్కూల్లో పండ్లు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో నియోజకవర్గ కన్వీనర్‌ వి.ఆర్‌. ఎలిజా ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్‌. ఎలిజాతో పాటు జానకి రెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

తణుకు నియోజకవర్గంలోని పట్టాణ మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆధ్యర్యంలో మహానేత జయంతి వేడుకలు జరిగాయి. మండల కేంద్రాల్లోని వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కృష్ణా జిల్లా నందిగామ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతిని పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నందిగామ సమన్వయ కర్త డాక్టర్‌ జగన్‌ మోహన్‌ రావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ అప్పారావు  ద్వారకా సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బసవా భాస్కరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణ, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

విశాఖ పట్నంలోని ఏయూలో వైఎస్సార్‌సీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు ఆధ్యర్యంలో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్సీ అభ్యర్థులకు కరెంట్‌ అపైర్స్‌, జనరల్‌ స్టడీస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాక పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైలాల విజయ్‌ కుమార్‌, విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారయణతో పాటు ప్రొఫెసర్‌ ప్రేమనందం, ప్రొఫెసర్‌ భైరాగి రెడ్డి, విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గ ఇంచార్జీ సింహాద్రి రమేష్‌ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీకార్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నమెంట్‌ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకోల్లు నరసింహరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్యర్యంలో మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విసన్న పేటలోని లేఖన స్వచ్ఛంద సంస్థలోని వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు ఎంపీపీ బి. రాణి, మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి దుర్గారావు, ఎస్‌ ప్రకాష్‌, కుటుంబరావు, దస్తగిరి, శివ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో..

ఖమ్మం జిల్లా వైఎస్సార్‌సీసీ నాయకులు ఆధ్వర్యంలో మహానేత వైఎస్సార్‌ 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 180 విగ్రహాలకు పాలాభిషేకం మరియు అనేక చోట్ల కేక్ కటింగ్, ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్, రాష్ట్ర కార్యదర్శులు ఆలస్యం సుధాకర్ వెంకటరామిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, టౌన్ ప్రెసిడెంట్‌ అప్పి రెడ్డి, జిల్లా సేవాదళ్ సభ్యుడు రోసి రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కర్రి గంగాధర్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్‌ 69వ జంయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వం ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు జెట్టీ రాజశేఖర్‌, తదితర నాయకులు వెఎస్సార్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు అందించలేదు
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రహ్మణవేలెంలో వైఎస్సార్‌ విగ్రహానికి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌ది. రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో మహానేత ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో  వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌ అందించిన సంక్షేమ పథకాలను నేతలు కొనియాడారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో  వైయస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు వృద్ధులకు  బ్రెడ్, పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ పెద్ద బజార్‌లో జిల్లా నేతలు భారీ వైఎస్సార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పూల మాలలతో నివాళులు అర్పించారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement