దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ముస్లింలకు సంబంధించిన రుణాలు మాఫీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు పలువురు ముస్లింలు వివరించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చింతలపాలెంలో సాగుతున్న పాదయాత్రలో వైఎస్ జగన్‌ను ముస్లింలు శనివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ అమీరుద్దీన్, రెహిన్‌మున్నీసా, ఎస్‌కే బేగంలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలు ఇల్లు నిర్మించుకునేందుకు ఘర్ ఔర్ మకాన్ రుణాలు మంజూరు చేసిందని, నిరుపేద కుటుంబాల వారు తిరిగి రుణాలు కట్టలేక ఇబ్బందులు పడేవారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఘర్ ఔర్ మకాన్ రుణాలు మాఫీ చేశారన్నారు. పేద ముస్లింలకు ఇంత మేలు చేసిన వైఎస్‌ను ఎన్నటికీ మరువలేమన్నారు. తండ్రి వైఎస్ లాంటి సువర్ణ పాలన అందించాలని జగన్‌ను కోరామన్నారు. జగన్ సీఎం అయితే నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment