రజకనగర్‌లో వైఎస్సార్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. ఆదివారం వైఎస్ జయంతిని పురస్కరించుకుని శనివారం బీసీ సెల్ నగర కమిటీ ఎం. శ్రీనివాసులు, పార్టీ 48వ డివిజన్ కన్వీనర్ ఎం.వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక 48వ డివిజన్‌లో వివేకానంద నగర పాలక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు అనంత చంద్రారెడ్డి కేక్ కట్ చేశారు.
అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై.వి.శివారెడ్డి, మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, డివిజన్ నాయకులు భారతమ్మ, రవికుమార్‌రెడ్డి, రామచంద్రయ్యస్వామి, ఎర్రిస్వామి, మురళీ, రామకృష్ణ, ఆదినారాయణరెడ్డి, రామయ్య, డివిజన్ల కన్వీనర్లు వడ్డే రామచంద్ర, ఈడిగ భాస్కర్, నిజాం, సైఫుల్లాబేగ్, డిస్ శీనా, ఖాజా పాల్గొన్నారు.
అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో...
నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక 50వ డివిజన్‌లోని స్పందన మానసిక వికలాంగుల పాఠశాలలో వైఎస్ జయంతిని జరుపుకొన్నారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నాయకులు అనంత చంద్రారెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ పాలన అభివృద్ధే మంత్రంగా సాగిందన్నారు. అన్ని వర్గాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మహిళా కమిటీ నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు కసనూరు రఘునాథరెడ్డి, రిలాక్స్ నాగరాజు, రాధాకృష్ణ, సురేష్, , జిలాన్, గైబు, బాషా, సుజాతరెడ్డి, భారతి, లావణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment