జోహార్‌ వైఎస్సార్‌... | YS Rajasekhara Reddy Death Anniversary Day In Karimnagar | Sakshi
Sakshi News home page

జోహార్‌ వైఎస్సార్‌...

Published Mon, Sep 3 2018 10:02 AM | Last Updated on Mon, Sep 3 2018 10:02 AM

YS Rajasekhara Reddy Death Anniversary Day In Karimnagar - Sakshi

వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నగేశ్, తదితరులు

మంకమ్మతోట(కరీంనగర్‌): దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని గీతాభవన్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నగేష్‌ ముఖ్యతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభు త్వ ప్రధానాస్పత్రి పిల్లలవార్డులో, బాలసదన్‌లోని పిల్లలకు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ వసతి గృహంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ పేద ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ఆలోచించేవారని కొనియాడారు.

పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేశారన్నారు. మహిళలకు పావలవడ్డీ, వృద్ధులు, వికలాంగులకు పింఛన్‌ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ. షాహెంషా, నగర అధ్యక్షుడు ఇంజినీర్‌ సాన రాజన్న, యూత్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా కార్యదర్శి దీటి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడిన నేత : పొన్నం  
ఇచ్చిన మాటకు కట్టుబడిన నేత వైఎస్సార్‌ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆయన కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించడం, నమ్ముకున్న వారికి న్యాయం చేయడం వైఎస్సార్‌ నైజామని పేర్కొన్నారు. తాను ప్రారంభించిన ప్రతి పథకానికీ ఇందిర, రాజీవ్‌ పేర్లను పెట్టి విశ్వసనీయతను చాటుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, మున్పిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆకుల ప్రకాష్, సరిళ్ల ప్రసాద్, బుచ్చిరెడ్డి, చెన్నాడి అజిత్‌రావు, మునిగంటి అనిల్, పడిశెట్టి భూమయ్య, వొంటెల రత్నాకర్, పొన్నం సత్యం, కటకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, మూల రవీందర్‌రెడ్డి, పిల్లి మహేష్, మడుపు మోహన్, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కె.సదానందచారి, తాజ్, లింగంపెల్లి బాబు, ఎండీ నదీమ్, గడప శ్రీనివాస్, పచ్చిమట్ల రాజశేఖర్, మర్రి శ్రీనివాస్, సుంకరి గణపతి తదితరులు పాల్గొన్నారు.

రామడుగులో.. 
రామడుగు(చొప్పదండి): రామడుగులో వైఎస్సార్‌ వర్ధంతిని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పులి ఆం జనేయులుగౌడ్‌ అధ్వర్యంలో నిర్వహించారు. పో చమ్మ చౌరస్తాలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. కార్యక్రమానికి యు వజన కాంగ్రెస్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు నాగి శేఖర్‌ హాజరై మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోల రమేష్, నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, కాడె శంకర్, గోనెపల్లి బాలాగౌడ్, దేవకిషన్, బొమ్మరవేని తిరుపతి, బాపురాజు, నారాయణ, పిండి శ్రీని వాస్‌రె డ్డి, వెంకటేష్, రాజశేఖర్, సముద్రాల సత్యం, అజయ్, సుంకె ఆశాలు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సేవలు మరువలేనివి వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల నరేష్‌ 
హుజూరాబాద్‌: వైఎస్సార్‌ సేవలు మరువలేనివని వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల నరేష్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు ఉచిత విద్యుత్, ప్రాంతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య, ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు మేడ్దుల అర్జున్‌ యాదవ్, మునిగంటి రాకేష్‌రెడ్డి, అపరాధ మహేందర్, బరిగే తిరందాస్, పెద్ది చంద్రకాంత్, ముక్క అన్వేష్, కాతం రణదీర్, నాగవెల్లి మధుసూదన్, శ్రీకాంత్, విష్ణు, పవన్, మహేష్, ప్రవీన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పండ్లు పంపిణీ చేస్తున్న నగేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement