మహానేత వైఎస్సార్‌కు నివాళి అర్పించిన ఎన్నారైలు | South Africa NRIs Pays Tributes To YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 2 2018 11:06 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

South Africa NRIs Pays Tributes To YS Rajasekhara Reddy - Sakshi

జొహన్నెస్‌ బర్గ్ : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. జొహన్నెస్‌ బర్గ్‌లోని ఎన్నారైలు కల్లా నరసింహ రెడ్డి, కొత్త రామకృష్ణా, సూర్యారామి రెడ్డి, అరుణ్, కిరణ్, వంశీ ఓబులశెట్టి, మురళి సోమిశెట్టి, రాంబాబు, మోహన్, కుమార్ ఎద్దుల పల్లి ,సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మహా నేత వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫాన్స్ సౌత్ ఆఫ్రికా తరుపున కల్లా నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ పేద ప్రజలకు ఎంతో  మేలు చేశారని..  ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ,108, పక్కా ఇల్లు ఇలా చాలా పథకాలతో ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని అన్నారు. రామకృష్ణ కొత్త మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపిందని కొనియాడారు. కుమార్, మోహన్ మాట్లాడుతూ..  రైతులకు రాజన్న చేసిన మేలు  రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదని అన్నారు. సభ్యులు అందరూ మహానేత కు నివాళులు అర్పించిన తరువాత జోహానసబర్గ్ లోని ఓల్డేజ్ హోమ్ లో 300 మంది వృద్దులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి మహానేత వైఎస్సార్ ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement