
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి సం దర్భంగా ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం (లోటస్‌పాండ్)లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సేవా కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారని పేర్కొంది.