![YS Rajashekar Reddy Is Powerfull Leader In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/2/ysr-rajj.jpg.webp?itok=BLscSn9E)
రైతుల సంక్షేమానికి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. రైతన్నలు, సాగునీటి ప్రాజెక్టులతో వైఎస్‌కు అవినాభావ సంబంధం ఉంది. లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ప్రారంభించిన పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ పేరు శాశ్వతంగా జనంలో నిలిచిపోవడానికి కారణమయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన జీవితకాలంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొందరు పాలకులు నామమాత్రపు మార్పులు, చేర్పులు చేసి పేర్లు మార్చినాగాని పెద్దాయనే వీటికి రూపుదిద్దారనే వాస్తవం ప్రజలకు తెలుసు. పేదలు, ప్రభుత్వ సాయం అవసరమైన బడుగువర్గాల సంక్షేమానికి వైఎస్ ఎంతగా అంకితమయ్యారో చెప్పడానికి ఆదివాసీలకు 8 లక్షల ఎకరాల భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
2003 వేసవిలో పాదయాత్ర ముగిసే సమయం వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని ఇతర సీని యర్ నాయకుల్లో ఒకరేగాని కాంగ్రెస్ పార్టీలో రాజీ పడని యోధునిగా జనాదరణ సంపాదించారు. పాద యాత్రలో పేద ప్రజల కష్టాలు ఆయన కళ్లారా చూశారు. వివిధ వర్గాల జనం అవసరాలపై పూర్తి అవగాహన కలిగింది. పాదయాత్ర పూర్తయ్యేనాటికి వైఎస్సార్ పూర్తిగా మారిన మనిషి అయ్యారు. ప్రజా జీవితంలో రాజకీయ నాయకుని పాత్రపై ఆయన అవగాహనలో సంపూర్ణ మార్పు వచ్చింది. ఆయనే స్వయంగా చెప్పినట్టు కోపం నరం పూర్తిగా తెగి పోయింది. ముఖంపై చెరగని చిరునవ్వే ఆయన వ్యక్తిత్వానికి చిహ్నంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ లోకం విడిచి వెళ్లాక కూడా ఆయన చిరునవ్వే ప్రజలను నిత్యం పలకరిస్తోంది. ముఖ్యమంత్రి పద విని అధికార పీఠంగా ఆయన ఎన్నడూ అనుకోలేదు. బాధ్యతకు, జవాబుదారీతనానికి, ఆత్మవిశ్వాసానికి సాధనంగానే ఆయన చూశారు. పేదల రక్షకునిగా ఆయన వ్యవహరించారు. సీఎంగా ప్రమాణం చేశాక ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం అయింది. అందుకే ఆయనను పెద్దాయనగా పేదలు ఇప్పటికీ పిలుచు కుంటున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి దాదాపు దశాబ్దం కావస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశవ్యాప్తంగా వైఎస్సార్ అత్యంత ప్రజాదరణ కలి గిన నేతగా నిలబడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అధి కారం చేపట్టాక వైఎస్సార్ ఎన్నెన్నో సంక్షేమ కార్య క్రమాలు రూపొందించి ప్రవేశపెట్టారు. వాటి ప్రయో జనాలు గరిష్ట లేదా సంతృప్త స్థాయిలో ఉంటేనే పేద రికాన్ని నిర్మూలించడం సాధ్యమౌతుందని ఆయన నమ్మారు. ప్రజాసమస్యలు, కార్యక్రమాల రూపక ల్పన, అమలు, వాటి తీరు పరిశీలన వంటి విష యాల్లో వైఎస్సార్ ఎవరికి లేనంత శక్తి, ఉత్సాహం, ఓర్పుతో పనిచేశారు. చేతికందిన సమాచారాన్ని జల్లె డపట్టి సత్యాసత్యాలు గ్రహించి ప్రజల కోసం ఆయన పనిచేసిన పద్ధతి అనితర సాధ్యం. అద్భుతమైన జ్ఞాప కశక్తి కూడా ఆయన పాలన జనరంజకంగా సాగడా నికి కారణమైంది. ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల విషయంలో నిబంధనలేవైనా అడ్డంకిగా మారితే, ‘జనహితం తర్వాతే నిబంధనలు, నియ మాలు’ అని ఆయన బాహాటంగా చెప్పడమేగాక ఆచ రణలో చేసి చూపించేవారు. ఈ కారణంగానే వైఎస్ జనాదరణ సంపాదించి, 2009 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాగలి గారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతాలో 33 లోక్‌సభ స్థానాలు పడేలా చూసి, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు బలోపేతం కావడానికి ఆయన కారకుల య్యారు. మరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాకపోవడం విశేషం.
వైఎస్‌కు అనూహ్యమైన రీతిలో పెరుగుతున్న జనాదరణ ప్రతిపక్షంలోని, కాంగ్రెస్‌లోని కొన్ని అసం తృప్త శక్తులకు మింగుడు పడలేదు. అసూయతో ఇలాంటి నేతలు రగిలిపోయారు. అయితే, ఆయ నకు, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ చేసే ధైర్యం ఆయన బతికున్నంత వరకూ ఈ శక్తులకు లేకుండాపోయింది. వైఎస్ మరణించాక ఈ దుష్ట శక్తులు తమ అసలు రూపం ప్రదర్శించాయి. వైఎస్ బాటనే ఎంచుకున్న ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నో ఇబ్బందులు సృష్టించాయి. అయితే జననేత మార్గంలోనే పయనం ప్రారంభించిన ఆయన కుమా రుడు జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి మాదిరిగానే తిరుగు లేని ధైర్యసాహసాలతో ప్రజల కోసం పోరాటం కొన సాగించారు. ఈ క్రమంలో బలమైన నేతగా ఎది గారు. ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ జాతు లకు కేటాయించిన అన్ని అసెంబ్లీ స్థానాలను (పశ్చిమ గోదా వరి జిల్లాలోని ఒక స్థానం మినహా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే వైఎస్‌పై ఆదివాసీలకున్న అభిమానానికి ఇది అద్దం పడు తోంది. వైఎస్ హయాంలో మొదలై, అమలైన సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆదివాసీలకు ఆయన దేవుడయ్యారు. ఏపీలో ప్రస్తుత ప్రభు త్వం గిరిజన ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు నిర్మిస్తూ అధునాతన కమ్యూనికేషన్ సౌకర్యాలు, పింఛన్లు, రేషన్లు కల్పిస్తోంది. అయినా, పాలకపక్షా నికి వారు దగ్గరవలేదు. వైఎస్‌పై ఉన్న ప్రేమాభిమానాలు శాశ్వ తంగా నిలిచిపోయాయి.
పోడు సాగుచేసే ఆదివాసీ లకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో వారు తాము దున్నే భూములకు యజమానుల య్యారు. సీఎంగా ప్రమాణం చేశాక ఆదివాసీలకు తాము సాగుచేసే భూముల పట్టాలు లేవనే విషయం వైఎస్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులకు గిరిజను లకు భూమి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం గురించి అర్థమయ్యేలా చేశారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆదివాసీ చట్టానికి భారత ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చేలా ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఫైలు కది లేలా చేశారు. ఫలితంగా పోడు భూములు సాగు చేసే ఆదివాసీలకు పట్టాలు ఇవ్వడం వైఎస్ ప్రభుత్వా నికి సాధ్యమైంది. పట్టాలు ఇవ్వడానికి మొదట ఆది వాసీల సాగులో ఉన్న భూములు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాలని గుర్తించారు. 2009 సెప్టెంబర్‌లో మరణించే వరకూ దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి ఆదివాసీ రైతులకు పట్టాలు ఇప్పించారు. అందుకే ఆదివాసీల ఆదరాభిమానాలు రాజశేఖరరెడ్డికి ఏ ముఖ్యమంత్రికీ లేనంతగా లభించాయి. కాని, పెద్దాయన కన్నుమూ శాక ఈ పోడు భూముల పట్టాల కార్యక్రమం కింద ఒక్క ఎకరా భూమికి కూడా గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. పేదలు, బడు గువర్గాల సంక్షే మానికి వైఎస్ ఎంతగా అంకితమ య్యారో చెప్పడానికి ఆదివాసీలకు భూమి పట్టాల కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది.
రైతుల సంక్షేమానికి చేపట్టిన సాగునీటి ప్రాజె క్టులు రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ప్రారంభించిన పోలవరం, పులిచింతల, పోతిరెడ్డి పాడు, కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ పేరు శాశ్వతంగా జనంలో నిలిచిపోవడానికి కారణ మయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన జీవితకా లంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొందరు పాలకులు నామమాత్రపు మార్పులు, చేర్పులు చేసి పేర్లు మార్చినాగాని పెద్దాయనే వీటికి రూపుదిద్దారనే వాస్తవం ప్రజలకు తెలుసు. ఇలా సంక్షేమ కార్యక్ర మాలతో వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
కరుణాకర్
Comments
Please login to add a commentAdd a comment