karunakar
-
యువతి ఫొటోలు మార్ఫింగ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తెనాలి రూరల్: ఒకవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ, వైద్య రంగంలోనే ఉన్న ఓ యువతి ఫొటోలను టీడీపీ నాయకుడి తమ్ముడు, మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... తెనాలికి చెందిన ఓ యువతి వైద్య రంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా చేస్తున్నారు. ఆమె ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. దీంతో బాధితురాలు రెండు వారాల కిందట తెనాలి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ను ఐదు రోజులు కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, హార్డ్‌వేర్ ఇంజినీర్ అయిన భరత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరినీ గుట్టుగా తమ స్వస్థలాలకు పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇద్దరు నిందితులను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లింక్‌పై విచారణ ఏదీ? అబ్దుల్ సత్తార్, కరుణాకర్, భరత్ హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. తెనాలి పోలీసుల విచారణలో వీరి వద్ద అనేకమంది యువతులు, మహిళల నగ్న చిత్రాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నిందితులను వదిలిపెట్టినట్లు సామాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.కేసు దర్యాప్తు పూర్తి కాలేదు ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసులో ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేశాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమంది నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సున్నితమైన అంశాలు ఉండడంతో పూర్తి వివరాలను అప్పుడే వెల్లడించే అవకాశం లేదు. – ఎ.సుధాకర్, తెనాలి టూ టౌన్ సీఐ -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు!
మెదక్: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సుఖ ప్రసవం జరిగిన సంఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డిపో మేనేజర్ నారాయణ వివరాలు. పొట్పల్లి గ్రామానికి చెందిన హాజీ పాషా భార్య జరీనా బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం కోసం బీదర్ ఆసుపత్రికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి సహాయకులతో కలిసి జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు పట్టణం దాటగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్ ఆనందం, కండక్టర్ కరుణాకర్ మార్గమధ్యలో ఉన్న మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బస్సును తరలించారు. నర్స్ సుధారాణిని బస్సు వద్దకు తీసుకుని వచ్చేలోపు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. -
దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్ చేయాలి
తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రూ.1200 బిల్ లొల్లి.. కరెంట్ కట్ చేశాడని.. లైన్‌మన్‌పై పెట్రోల్ పోసి..
గజ్వేల్ రూరల్: బిల్లు చెల్లించలేదని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించిన జూనియర్ లైన్‌మన్‌పై వినియో గదారుడు పెట్రోల్ పోశాడు. గజ్వేల్ మున్సి పాలిటీ పరిధిలోని క్యాసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యుత్ శాఖాధికారులు, వినియోగదా రుని కుటుంబ సభ్యులు, గజ్వేల్ పోలీసు లు తెలిపిన వివరాలివి. క్యాసారంలోని 2వ వార్డుకు చెందిన సుంకరి కరుణాకర్ ఇంటికి 2 నెలలకు రూ.1,200 బిల్లు వచ్చింది. ఇటీవల జూనియర్ లైన్‌మన్ నరేష్ తన విధుల్లో భాగంగా కరుణాకర్‌ను బిల్లు చెల్లించాల ని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే విషయాన్ని జేఎల్ఎం నరేశ్ విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. శనివారం విద్యు త్ స్తంభం ఎక్కి కరుణాకర్ ఇంటికి కనెక్షన్ తొలగించాడు. దీంతో అసహనానికి గురైన కరుణాకర్ తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసి నరేశ్‌పై పోసి అగ్గిపెట్టె తీయడంతో అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో నరేశ్ ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తనపై హ త్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. కాగా తమకు జీతం రాలేదని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ నరేష్ వినకుండా విద్యుత్ సరఫరాను తొలగించినట్లు కరుణాకర్ భార్య కావ్య పేర్కొన్నారు. -
‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’
సాక్షి, అనంతపురం(కూడేరు): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు. అదే నిర్లక్ష్యం... అదే ఉదాసీనత. తాజాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కూడేరులో ఓ యువరైతు కరెంటు తీగకు బలయ్యాడు. తండ్రికి చేదోడుగా.. కూడేరు మండలం గొటుకూరుకు చెందిన బోయ నల్లప్ప, ఓబుళమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు కేశవయ్య గ్రామంలోనే ఉంటూ తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. రెండో కుమారుడు కరుణాకర్ (22) బీటెక్ ద్వితీయ సంవత్సరంతో చదువు మానేసి తండ్రికి చేదోడుగా వ్యవసాయ పనులు చేపట్టాడు. పుట్టిన రోజే మృత్యు గీతిక ఈ నెల 4న తన పుట్టిన రోజు కావడంతో వేకువజామునే కరుణాకర్ నిద్రలేచాడు. ‘అమ్మా! ఈ రోజు నా పుట్టిన రోజు. ఏదైనా స్పెషల్ చేసిపెట్టు’ అంటూ తల్లిని అడిగిన కరుణాకర్.. అనంతరం పంటకు నీరు పెట్టి వస్తానంటూ తండ్రితో చెప్పి ద్విచక్ర వాహనంపై పొలానికి బయలుదేరాడు. అప్పటికే ఆ మార్గంలో 11కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన మరో రైతు ప్రతాపరెడ్డి.. వెంటనే ఫోన్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశాడు. అనంతరం అటుగా ఎవరైనా వచ్చి ప్రమాదం బారిన పడుతారని భావించిన ఆయన కాసేపు అక్కడే నిలబడ్డాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న కరుణాకర్‌ను చూసి కేకలు వేసి అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే సమయం మించి పోయింది. రోడ్డుకు అడ్డుగా వేలాడుతున్న విద్యుత్ తీగ నేరుగా కరుణాకర్‌ను తాకడంతో అతను కుప్పకూలాడు. ఉపశమన చర్యలు చేపట్టే లోపు మృతి చెందాడు. త్వరగా వస్తానంటివి కదయ్యా.. ‘పుట్టిన రోజును స్నేహితుల మధ్య జరుపుకోవాలని సరదా పడితివి. ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా!’ అంటూ కరుణాకర్ మృతదేహంపై పడి తల్లి ఓబుళమ్మ, తండ్రి నల్లప్ప బోరున విలపించారు. ‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’ అంటూ గుండెలవిసేలా రోదించారు. మృతదేహంతో రాస్తారోకో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కరుణాకర్ మృతి చెందాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరుణాకర్ మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి చేర్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్, ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేకూరేవరకూ ఆందోళన విరమించబోమని భీష్మించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులతో పోలీసు అధికారులు ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ శాఖ ఏఈ సెలవులో ఉన్నారని తెలియడంతో ఆందోళనకారులతో చర్చించి న్యాయం చేకూరుస్తామంటూ భరోసానిచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఆర్థిక సాయం అందజేస్తాం కరుణాకర్ మృతిపై విద్యుత్ శాఖ ఏఈ రాజేష్ మాట్లాడుతూ.. జరిగిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో కౌలురైతు... ఉరవకొండ: విద్యుత్ షాక్‌కు గురై ఓ కౌలురైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన నరసింహులు, భీమక్క దంపతుల కుమారుడు మారుతి (21) వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన మరో రైతు వద్ద ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని తన తండ్రితో కలసి మిర్చి పంట సాగు చేపట్టాడు. మంగళవారం ఉదయం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన మారుతి... స్టార్టర్ బాక్స్ వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు వెంటనే మారుతిని 108 అంబులెన్స్ ద్వారా ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అదృశ్యమై ఉరికి వేలాడిన ఇద్దరు.. వివాహేతర సంబంధమే కారణమా?
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన మేకతొట్టి వజ్రమ్మ పాతబడిపోయిన తన ఇంటికి తాళం వేసి కొంతకాలంగా అదే గ్రామంలోని కూతురు ఇంట్లో ఉంటోంది. గురువారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లే సరికి ఒక పురుషుడు, ఓ మహిళ మృత దేహాలు దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. స్థానికులు పరిశీలించి తమ గ్రామానికే చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (32), ఇంజిమళ్ల కృష్ణవేణి (25)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్, వీ.ఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగి ఉంటుంది.. లంకపల్లికి చెందిన ధర్మయ్య, కృష్ణవేణి గ త నెల 26 నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి భర్త బాలయ్య (30) అదేరోజు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. కృష్ణవేణి, ధర్మయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ అవమానంతోనే బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ప్ర చారం జరుగుతోంది. కాగా, బుధవారం నుంచే ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా, బాల య్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళ న చెందిన కృష్ణవేణి, ధర్మయ్య ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వీరిద్దరిని హత్య చేశాక బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నా రు. వజ్రమ్మ తన ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన విషయం తెలుసుకుని వెనుక తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, కృష్ణవేణి మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఇక ధర్మయ్య భార్య కూడా భర్త వివాహేతర సంబంధం తెలియడంతో పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. -
శ్రీదేవి సోడా సెంటర్.. ఓ తీపి జ్ఞాపకం
సాక్షి,ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం తన జీవితంలో ఒక తీపి జ్ఞాపకాన్ని ఇచ్చిందని ఆ చిత్ర హీరో సుదీర్ బాబు అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న అంబికా థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. తొలుత చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ఎలా ఉంది అని అడిగి వారి నుంచి సానుకూల సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా హీరో సుదీర్‌బాబు చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో మాట్లాడుతూ చిత్రం తాము ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచుతూ వారి ఆదరణ పొందుతోందన్నారు. ఈ విజయం స్ఫూర్తిగా మరిన్ని విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. దర్శకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ తమ చిత్రంలో సుదీర్‌బాబు నటన హైలెట్‌గా నిలిచిందన్నారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా చిత్రాన్ని వినోదాత్మకంగా నిర్మించామని, విడుదలైన అన్ని సెంటర్లలో చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, వర్షాలు, కోవిడ్ భయం వెంటాడుతున్నా తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. థియేటర్ మేనేజర్ రఘు, జీఎం వెంకట్, సుదీర్‌కుమార్ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు. చదవండి: Seetimaarr Trailer: సీటీమార్ ట్రైలర్ చూశారా? -
తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు
ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్ రిలీజ్ చేశారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్ మూమెంట్‌లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్‌గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు. సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్ పూజారి, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి. -
కోట్లాది ప్రజల గుండెల్లో వైఎస్సార్
రైతుల సంక్షేమానికి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. రైతన్నలు, సాగునీటి ప్రాజెక్టులతో వైఎస్‌కు అవినాభావ సంబంధం ఉంది. లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ప్రారంభించిన పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ పేరు శాశ్వతంగా జనంలో నిలిచిపోవడానికి కారణమయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన జీవితకాలంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొందరు పాలకులు నామమాత్రపు మార్పులు, చేర్పులు చేసి పేర్లు మార్చినాగాని పెద్దాయనే వీటికి రూపుదిద్దారనే వాస్తవం ప్రజలకు తెలుసు. పేదలు, ప్రభుత్వ సాయం అవసరమైన బడుగువర్గాల సంక్షేమానికి వైఎస్ ఎంతగా అంకితమయ్యారో చెప్పడానికి ఆదివాసీలకు 8 లక్షల ఎకరాల భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 2003 వేసవిలో పాదయాత్ర ముగిసే సమయం వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని ఇతర సీని యర్ నాయకుల్లో ఒకరేగాని కాంగ్రెస్ పార్టీలో రాజీ పడని యోధునిగా జనాదరణ సంపాదించారు. పాద యాత్రలో పేద ప్రజల కష్టాలు ఆయన కళ్లారా చూశారు. వివిధ వర్గాల జనం అవసరాలపై పూర్తి అవగాహన కలిగింది. పాదయాత్ర పూర్తయ్యేనాటికి వైఎస్సార్ పూర్తిగా మారిన మనిషి అయ్యారు. ప్రజా జీవితంలో రాజకీయ నాయకుని పాత్రపై ఆయన అవగాహనలో సంపూర్ణ మార్పు వచ్చింది. ఆయనే స్వయంగా చెప్పినట్టు కోపం నరం పూర్తిగా తెగి పోయింది. ముఖంపై చెరగని చిరునవ్వే ఆయన వ్యక్తిత్వానికి చిహ్నంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ లోకం విడిచి వెళ్లాక కూడా ఆయన చిరునవ్వే ప్రజలను నిత్యం పలకరిస్తోంది. ముఖ్యమంత్రి పద విని అధికార పీఠంగా ఆయన ఎన్నడూ అనుకోలేదు. బాధ్యతకు, జవాబుదారీతనానికి, ఆత్మవిశ్వాసానికి సాధనంగానే ఆయన చూశారు. పేదల రక్షకునిగా ఆయన వ్యవహరించారు. సీఎంగా ప్రమాణం చేశాక ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం అయింది. అందుకే ఆయనను పెద్దాయనగా పేదలు ఇప్పటికీ పిలుచు కుంటున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి దాదాపు దశాబ్దం కావస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశవ్యాప్తంగా వైఎస్సార్ అత్యంత ప్రజాదరణ కలి గిన నేతగా నిలబడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అధి కారం చేపట్టాక వైఎస్సార్ ఎన్నెన్నో సంక్షేమ కార్య క్రమాలు రూపొందించి ప్రవేశపెట్టారు. వాటి ప్రయో జనాలు గరిష్ట లేదా సంతృప్త స్థాయిలో ఉంటేనే పేద రికాన్ని నిర్మూలించడం సాధ్యమౌతుందని ఆయన నమ్మారు. ప్రజాసమస్యలు, కార్యక్రమాల రూపక ల్పన, అమలు, వాటి తీరు పరిశీలన వంటి విష యాల్లో వైఎస్సార్ ఎవరికి లేనంత శక్తి, ఉత్సాహం, ఓర్పుతో పనిచేశారు. చేతికందిన సమాచారాన్ని జల్లె డపట్టి సత్యాసత్యాలు గ్రహించి ప్రజల కోసం ఆయన పనిచేసిన పద్ధతి అనితర సాధ్యం. అద్భుతమైన జ్ఞాప కశక్తి కూడా ఆయన పాలన జనరంజకంగా సాగడా నికి కారణమైంది. ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల విషయంలో నిబంధనలేవైనా అడ్డంకిగా మారితే, ‘జనహితం తర్వాతే నిబంధనలు, నియ మాలు’ అని ఆయన బాహాటంగా చెప్పడమేగాక ఆచ రణలో చేసి చూపించేవారు. ఈ కారణంగానే వైఎస్ జనాదరణ సంపాదించి, 2009 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాగలి గారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతాలో 33 లోక్‌సభ స్థానాలు పడేలా చూసి, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు బలోపేతం కావడానికి ఆయన కారకుల య్యారు. మరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాకపోవడం విశేషం. వైఎస్‌కు అనూహ్యమైన రీతిలో పెరుగుతున్న జనాదరణ ప్రతిపక్షంలోని, కాంగ్రెస్‌లోని కొన్ని అసం తృప్త శక్తులకు మింగుడు పడలేదు. అసూయతో ఇలాంటి నేతలు రగిలిపోయారు. అయితే, ఆయ నకు, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ చేసే ధైర్యం ఆయన బతికున్నంత వరకూ ఈ శక్తులకు లేకుండాపోయింది. వైఎస్ మరణించాక ఈ దుష్ట శక్తులు తమ అసలు రూపం ప్రదర్శించాయి. వైఎస్ బాటనే ఎంచుకున్న ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నో ఇబ్బందులు సృష్టించాయి. అయితే జననేత మార్గంలోనే పయనం ప్రారంభించిన ఆయన కుమా రుడు జగన్మోహన్రెడ్డి తండ్రి మాదిరిగానే తిరుగు లేని ధైర్యసాహసాలతో ప్రజల కోసం పోరాటం కొన సాగించారు. ఈ క్రమంలో బలమైన నేతగా ఎది గారు. ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ జాతు లకు కేటాయించిన అన్ని అసెంబ్లీ స్థానాలను (పశ్చిమ గోదా వరి జిల్లాలోని ఒక స్థానం మినహా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే వైఎస్‌పై ఆదివాసీలకున్న అభిమానానికి ఇది అద్దం పడు తోంది. వైఎస్ హయాంలో మొదలై, అమలైన సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆదివాసీలకు ఆయన దేవుడయ్యారు. ఏపీలో ప్రస్తుత ప్రభు త్వం గిరిజన ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు నిర్మిస్తూ అధునాతన కమ్యూనికేషన్ సౌకర్యాలు, పింఛన్లు, రేషన్లు కల్పిస్తోంది. అయినా, పాలకపక్షా నికి వారు దగ్గరవలేదు. వైఎస్‌పై ఉన్న ప్రేమాభిమానాలు శాశ్వ తంగా నిలిచిపోయాయి. పోడు సాగుచేసే ఆదివాసీ లకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో వారు తాము దున్నే భూములకు యజమానుల య్యారు. సీఎంగా ప్రమాణం చేశాక ఆదివాసీలకు తాము సాగుచేసే భూముల పట్టాలు లేవనే విషయం వైఎస్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులకు గిరిజను లకు భూమి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం గురించి అర్థమయ్యేలా చేశారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆదివాసీ చట్టానికి భారత ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చేలా ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఫైలు కది లేలా చేశారు. ఫలితంగా పోడు భూములు సాగు చేసే ఆదివాసీలకు పట్టాలు ఇవ్వడం వైఎస్ ప్రభుత్వా నికి సాధ్యమైంది. పట్టాలు ఇవ్వడానికి మొదట ఆది వాసీల సాగులో ఉన్న భూములు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాలని గుర్తించారు. 2009 సెప్టెంబర్‌లో మరణించే వరకూ దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి ఆదివాసీ రైతులకు పట్టాలు ఇప్పించారు. అందుకే ఆదివాసీల ఆదరాభిమానాలు రాజశేఖరరెడ్డికి ఏ ముఖ్యమంత్రికీ లేనంతగా లభించాయి. కాని, పెద్దాయన కన్నుమూ శాక ఈ పోడు భూముల పట్టాల కార్యక్రమం కింద ఒక్క ఎకరా భూమికి కూడా గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. పేదలు, బడు గువర్గాల సంక్షే మానికి వైఎస్ ఎంతగా అంకితమ య్యారో చెప్పడానికి ఆదివాసీలకు భూమి పట్టాల కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది. రైతుల సంక్షేమానికి చేపట్టిన సాగునీటి ప్రాజె క్టులు రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ప్రారంభించిన పోలవరం, పులిచింతల, పోతిరెడ్డి పాడు, కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ పేరు శాశ్వతంగా జనంలో నిలిచిపోవడానికి కారణ మయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన జీవితకా లంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొందరు పాలకులు నామమాత్రపు మార్పులు, చేర్పులు చేసి పేర్లు మార్చినాగాని పెద్దాయనే వీటికి రూపుదిద్దారనే వాస్తవం ప్రజలకు తెలుసు. ఇలా సంక్షేమ కార్యక్ర మాలతో వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. కరుణాకర్ -
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్ : అమెరికాలో దుండగుల చేతిలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒహియోలోని ఓ మాల్లో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా వాసి కరేంగ్లే కరుణాకర్ (53)పై ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గత వారం (డిసెంబర్ 8) చోటుచేసుకుంది. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కాగా కాల్పులకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు కరుణాకర్‌కు భార్య విజయ, కుమారుడు అంకిత్ ఉన్నారు. వీరు ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. కరుణాకర్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
అక్టోబర్‌లో ఎస్సీ ఎస్డీఎఫ్ నోడల్ ఏజెన్సీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన నోడల్ ఏజెన్సీని సమావేశపర్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు వేగిరం చేసింది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకోసారి సమావేశం కావాలి. కానీ మార్గదర్శకాల విడుదలలో జాప్యం కావడంతో సమావేశం ఆలస్యమైంది. అయితే వచ్చే నెల రెండో వారంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ ఎస్డీఎఫ్ కింద 44 ప్రభుత్వ విభాగాలకు రూ.14,350 కోట్లు కేటాయించగా.. ఇందులో ఇప్పటివరకు రూ.4,550 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే నోడల్ ఏజెన్సీ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వీసీ ఎండీ తదితరులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
అనుమానాలుంటే ఇంటికెళ్లి ప్రశ్నించాలి
-
ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు వందనాలు
ధర్మవరం : తాను నటించిన అరణ్యం చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు కృతజ్ఞతలని ఆ సినిమా హీరో కరుణాకర్ తెలిపారు. ఈ నెల 7 న విడుదలైన అరణ్యం చిత్రంలో ధర్మవరం పట్టణానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు హీరో పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని చక్రవర్తి థియేటర్లో ఆ చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. సినిమా రిలీజైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోందని యూనిట్ సభ్యులు తెలిపారు. తమను ఆదరించిన ప్రేక్షకులకు, తమను నమ్మి హీరో పాత్ర ఇచ్చిన నిర్మాత, దర్శకుడు సుదర్శనరెడ్డికి కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో యూనిట్‌సభ్యులు శివ, మహరాజ్, శ్రీనివాసులు, శీనా, కళ్యాణ్; కార్తిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాపులను మభ్యపెట్టేందుకే మంజునాథ కమిషన్
అనంతపురం న్యూటౌన్ : కాపు సామాజిక వర్గం ప్రజలను మభ్యపెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మంజునాథ కమిషన్‌ను నియమించిందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకరరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగహంలో విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. కమిషన్ కాపుల సామాజిక పరిస్థితులను వివరిస్తుందే తప్ప రిజర్వేషన్లపై సమీక్షించే అధికారం ఉండదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు, బలిజ రిజర్వేషన్లపై గతంలో పుట్టుస్వామి కమిషన్‌తో పాటు అనేక కమిటీలను నియమించారని, అవన్నీ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకించడం తగదన్నారు. ఆర్థికంగా చితికిపోయిన అన్ని కులాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటే.. రిజర్వేషన్ల అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇన్ని దశాబ్దాలలో రిజర్వేషన్లు లేని వర్గాల అభివద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అల్లే మాధవరెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి
ఖమ్మం జిల్లా జూలూరుపాడు గ్రామంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి ఒక అప్రెంటీస్ లైన్‌మన్ మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కరుణాకర్(25) అనే లైన్‌మన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో పోల్‌పైనే మృతిచెందాడు. గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంట్ ఆఫ్ చేసి మృతదేహాన్ని కిందకు దించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
యాదగిరిగుట్ట (నల్లగొండ): అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని సాదువెల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ (32) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాకర్, నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అయితే గత ఏడాది వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది పంట దిగుబడి సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను విదేశాల నుంచి రప్పించాలంటూ...
తిరుపతి : తిరుపతిలో గత అర్థరాత్రి కలకలం రేగింది. విదేశాల్లో ఉన్న తన భార్యను రప్పించాలంటూ ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. స్థానిక బీటీఆర్ కాలనీకి చెందిన కరుణాకర్... కువైట్‌లో ఉన్న తన భార్య వరలక్ష్మిని వెంటనే రప్పించాలంటూ కుమారుడితో కలసి గృహ నిర్బంధం చేసుకొన్నాడు. కాగా కరుణాకర్, వరలక్ష్మిలకు పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. కాగా ఉపాధి కోసం కువైట్ వెళ్లిన వరలక్ష్మి గత మూడు నెలలుగా భర్తతో ఫోన్లో మాట్లాడటం లేదని సమాచారం. దీంతో తన భార్యను వెంటనే తిరుపతికి రప్పించాలంటూ కరుణాకర్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. భార్యను రప్పించకపోతే గ్యాస్ సిలిండర్‌ను పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు ఆరు గంటలపాటు ఈ హైడ్రామా సాగింది. చివరకు పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కరుణాకర్‌ను బయటకు తీసుకొచ్చారు. -
తల్లీకూతుళ్లపై అత్యాచారం..
దుబ్బాక : గిరిజన తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం శనివారం దుబ్బాక పోలీసు స్టేసన్ ఎదుట ధర్నా చేపట్టింది. మండలంలోని రామక్కపేట గ్రామానికి చెందిన లచ్చపేట కరుణాకర్, మోత్కు దిలీప్, రాగుల రఘు, మోత్కు నరేష్, బరిగె రాజు, వంజరి భాను కలిసి అదే గ్రామానికి చెందిన గిరిజన తల్లీకూతుళ్లపై పాశవికంగా దాడి చేసి అత్యాచారం చేశారని డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ఆరోపించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హత్యలు, రైతుల ఆత్మహత్యలు, అత్యాచారాలు ఉండవని పదే పదే వళ్లిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిపై వెంటనే స్పందించాలన్నారు. అత్యాచార నిందితులను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని భీష్మించుక కూర్చున్నారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆందోళనకారుల వద్దకు వచ్చి నిందితులను అరెస్టు చేసి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గొ డ్డుబర్ల భాస్కర్, మొగిలి భిక్షపతి, చం ద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సెంట్రిం గ్ దుర్గయ్య, కిష్టమ్మగారి కిష్టారెడ్డి, సీపీ ఐ నాయకులు మచ్చ శ్రీనివాస్, డీబీ ఎఫ్ నాయకులు ముత్యాల భూపాల్, టీడీపీ నాయకులు కాకి సైదయ్య, సోమారపు కాశయ్య, మహిపాల్‌రెడ్డి, ఏకలవ్వ సంఘం నాయకులు వనం రమేష్, వనం కనకయ్య, పోచయ్య, నిమ్మ న రసింహులు, నిమ్మ లక్ష్మణ్, రాజు, ఉపేందర్ పాల్గొన్నారు. నిందితులను శిక్షించాలని ఎస్పీకి వినతి : సంగారెడ్డి రూరల్ : దుబ్బాక మండలం రామక్కపేటలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా నాయకులు రాజయ్య, మల్లేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి నిర్భయ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సీపీఎం నాయకులు మౌలాలి, మహబూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ సజీవదహనం
మిర్యాలగూడ కైం : ఓ మహిళ సజీవదహనమైంది. సన్నిహితంగా ఉంటున్న యువకుడే ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పంటించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం.. అనుముల మండలం అల్వాలకు చెందిన కన్నెబోయిన రాములమ్మ కూతురు సరిత(35) వివాహం దేవరకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగి నీలం వెంకటేశ్వర్లుతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు జన్మించారు. మూడేళ్లుగా సరిత భర్తతో విడిగా ఉంటూ మిర్యాలగూడ మందులవారి కాలనీలో నివసిస్తోంది. కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లో ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా, కుమార్తె శ్రీజ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి అభ్యసిస్తోంది. సరిత తన తల్లిగారి ఊరైన అల్వాలకు చెందిన యువకుడు ఆవులదొడ్డి కరుణాకర్‌తో సన్నిహితంగా మెలుగుతోంది. ఘర్షణ పడి.. ఆపై కిరోసిన్ పోసి..? అల్వాలకు చెందిన కరుణాకర్ తరచు సరిత ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరుణాకర్ తీవ్ర ఆవేశానికి లోనైసరితపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో సరిత కరుణాకర్‌ను పట్టుకోవడంతో అతడికి మంటలు అంటుకున్నాయి. ఏదో విధంగా సరితను విడిపించుకున్న కరుణాకర్ ఇంటి ఆవరణలో ఉన్న నల్లా వద్ద మంటలను చల్లార్చుకుని, ఓ యువకుడి సహాయంతో ఆస్పత్రికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లోనే నిద్రిస్తున్న సరిత కూతురు లేచి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలు, పొగరావడాన్ని గమనించారు. వెంటనే ఇంటి వెనుక భాగం తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా మంటల్లో కాలుతున్న సరిత ఒంటిపై నీళ్లు చల్లారు. తీవ్ర గాయాలైన సరిత అక్కడికక్కడే మృతిచెందింది. మరోగదిలో ఉన్న సరిత కూతురును స్థానికులు క్షేమంగా బయటకు పంపారు. పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ మోహన్, సీఐ సుదర్శన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పెళ్లికి ఒప్పుకోరనే.. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణాకర్‌ను పోలీసులు విచారించారు. కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, దీనికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరనే బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే అతడి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే సరితకు తీవ్ర గాయాలై చనిపోవడం, కరుణాకర్ స్వల్పంగా గాయపడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరుణాకర్ ఈ ఘాతుకానికి ఒటిగట్టి పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా మెరుగైన చికిత్స కోసం కరుణాకర్‌ను అతడి బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి కన్నెబోయిన రాములమ్మ ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. -
మిస్‌ఫైర్
నార్నూర్/జైనూర్ : స్పెషల్ పార్టీ పోలీసు గన్ మిస్‌ఫైర్ అయింది. ఆ బుల్లెట్ ఖాళీ కోక్ సమీపంలో పండ్లు కొంటున్న గిరిజనుడికి తగలడంతో అతడికి గాయాలయ్యాయి. బాధితుడిని పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వాహనంలో బయల్దేరడంపై గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ఆగ్రహించారు. వాహనాన్ని అడ్డుకొని సిబ్బందిని నిలదీశారు. ఠాణా ముట్టడించి ఐదుగంటలపాటు ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిర్పూర్-యు మండలం లింగాపూర్ అటవీ ప్రాంతంలో కరీంనగర్ స్పెషల్ పార్టీ పోలీసులు సోమవారం కూంబింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం జైనూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలోని స్వీట్‌హౌస్ షెడ్డు కింద కూర్చుని నీళ్లు తాగుతుండగా స్పెషల్ పార్టీకి చెందిన కరుణాకర్ నిర్లక్ష్యంతో అతడి తుపాకి మిస్‌ఫైర్ అయింది. పక్కనే పండ్లు కొంటున్న జైనూర్‌కు చెందిన కనక అరుణ్ వెంకటేశ్‌కు బుల్లెట్ ఖాళీ కోక్ తగిలి తలకు గాయమైంది. గన్ పేలిన శబ్దానికి స్థానికులు తలోదిక్కుకు భయంతో పరుగులు తీశారు. అయితే గాయపడిన యువకుడిని పట్టించుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులు ఆర్టీసీ బస్సు ఎక్కి ఆసిఫాబాద్ బయల్దేరారు. వీరి తీరుపై ఆగ్రహించిన గిరిజన సంఘాల నాయకులు మండలంలోని జామ్ని గ్రామ సమీపంలో వారి బస్సును అడ్డుకున్నారు. వారిని నిలదీశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. యువకుడి సంరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని సీఐ రఘు హామీ ఇచ్చారు. వినిపించుకోని గిరిజనులు బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారు ఠాణాను ముట్టడించారు. సుమారు ఐదుగంటల పాటు స్టేషన్ ఎదుట బైఠాయించారు. సీఐ సూచనల మేరకు గిరిజనులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిబ్బందిపై కేసునమోదు చేశారు. వెంకటేశ్ చికిత్స నిమిత్తం రూ.5 వేలు అందించారు. చికిత్సకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. సీఐ వెంట కూబింగ్ పార్టీ ఎస్సై స్వామి ఉన్నారు. -
డిసెంబర్ 1న 5కె రన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలను డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ మాదవరం తెలిపారు. ఆయన సోమవారం ఎల్బీస్టేడియంలోని ఫతేమైదాన్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా మహిళలలో గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, మహిళల భద్రత, గృహ హింసలాంటి పలు అంశాలపై అవగాహన కల్పించే విధంగా డిసెంబర్ 1న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి 5కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 7న విదేశాలలో విద్యావకాశాలు, మహిళల ఫోరం సదస్సు, మహిళల సాధికారత, లైంగిక దాడి, పసిపిల్లల అమ్మకానికి సంబంధించిన సమస్యలు, సామాజిక సమస్యలు తదితర అంశాలపై శిల్పారామంలో సదస్సు జరుగుతుందని వివరించారు. అనంతరం 5కె రన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.