యాదగిరిగుట్ట (నల్లగొండ): అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని సాదువెల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ (32) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాకర్, నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అయితే గత ఏడాది వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది పంట దిగుబడి సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.