గజ్వేల్ రూరల్: బిల్లు చెల్లించలేదని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించిన జూనియర్ లైన్‌మన్‌పై వినియో గదారుడు పెట్రోల్ పోశాడు. గజ్వేల్ మున్సి పాలిటీ పరిధిలోని క్యాసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యుత్ శాఖాధికారులు, వినియోగదా రుని కుటుంబ సభ్యులు, గజ్వేల్ పోలీసు లు తెలిపిన వివరాలివి. క్యాసారంలోని 2వ వార్డుకు చెందిన సుంకరి కరుణాకర్ ఇంటికి 2 నెలలకు రూ.1,200 బిల్లు వచ్చింది.
ఇటీవల జూనియర్ లైన్‌మన్ నరేష్ తన విధుల్లో భాగంగా కరుణాకర్‌ను బిల్లు చెల్లించాల ని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే విషయాన్ని జేఎల్‌ఎం నరేశ్ విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. శనివారం విద్యు త్ స్తంభం ఎక్కి కరుణాకర్ ఇంటికి కనెక్షన్ తొలగించాడు. దీంతో అసహనానికి గురైన కరుణాకర్ తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసి నరేశ్‌పై పోసి అగ్గిపెట్టె తీయడంతో అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
దీంతో నరేశ్ ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తనపై హ త్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. కాగా తమకు జీతం రాలేదని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ నరేష్ వినకుండా విద్యుత్ సరఫరాను తొలగించినట్లు కరుణాకర్ భార్య కావ్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment