
ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు వందనాలు
ధర్మవరం : తాను నటించిన అరణ్యం చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు కృతజ్ఞతలని ఆ సినిమా హీరో కరుణాకర్ తెలిపారు. ఈ నెల 7 న విడుదలైన అరణ్యం చిత్రంలో ధర్మవరం పట్టణానికి చెందిన కరుణాకర్ అనే యువకుడు హీరో పాత్రను పోషించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని చక్రవర్తి థియేటర్‌లో ఆ చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. సినిమా రిలీజైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోందని యూనిట్ సభ్యులు తెలిపారు. తమను ఆదరించిన ప్రేక్షకులకు, తమను నమ్మి హీరో పాత్ర ఇచ్చిన నిర్మాత, దర్శకుడు సుదర్శనరెడ్డికి కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో యూనిట్‌సభ్యులు శివ, మహరాజ్, శ్రీనివాసులు, శీనా, కళ్యాణ్; కార్తిక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.