
తల్లీకూతుళ్లపై అత్యాచారం..
దుబ్బాక : గిరిజన తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం శనివారం దుబ్బాక పోలీసు స్టేసన్ ఎదుట ధర్నా చేపట్టింది. మండలంలోని రామక్కపేట గ్రామానికి చెందిన లచ్చపేట కరుణాకర్, మోత్కు దిలీప్, రాగుల రఘు, మోత్కు నరేష్, బరిగె రాజు, వంజరి భాను కలిసి అదే గ్రామానికి చెందిన గిరిజన తల్లీకూతుళ్లపై పాశవికంగా దాడి చేసి అత్యాచారం చేశారని డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ఆరోపించారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హత్యలు, రైతుల ఆత్మహత్యలు, అత్యాచారాలు ఉండవని పదే పదే వళ్లిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిపై వెంటనే స్పందించాలన్నారు. అత్యాచార నిందితులను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని భీష్మించుక కూర్చున్నారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆందోళనకారుల వద్దకు వచ్చి నిందితులను అరెస్టు చేసి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గొ డ్డుబర్ల భాస్కర్, మొగిలి భిక్షపతి, చం ద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సెంట్రిం గ్ దుర్గయ్య, కిష్టమ్మగారి కిష్టారెడ్డి, సీపీ ఐ నాయకులు మచ్చ శ్రీనివాస్, డీబీ ఎఫ్ నాయకులు ముత్యాల భూపాల్, టీడీపీ నాయకులు కాకి సైదయ్య, సోమారపు కాశయ్య, మహిపాల్‌రెడ్డి, ఏకలవ్వ సంఘం నాయకులు వనం రమేష్, వనం కనకయ్య, పోచయ్య, నిమ్మ న రసింహులు, నిమ్మ లక్ష్మణ్, రాజు, ఉపేందర్ పాల్గొన్నారు.
నిందితులను శిక్షించాలని ఎస్పీకి వినతి :
సంగారెడ్డి రూరల్ : దుబ్బాక మండలం రామక్కపేటలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా నాయకులు రాజయ్య, మల్లేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి నిర్భయ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్పీని కలిసిన వారిలో సీపీఎం నాయకులు మౌలాలి, మహబూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.