విద్యుదాఘాతంతో ఖమ్మం జిల్లాలో ఓ అప్రెంటీస్ లైన్ మన్ మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా జూలూరుపాడు గ్రామంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి ఒక అప్రెంటీస్ లైన్‌మన్ మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కరుణాకర్(25) అనే లైన్‌మన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో పోల్‌పైనే మృతిచెందాడు. గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంట్ ఆఫ్ చేసి మృతదేహాన్ని కిందకు దించారు.