
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తప్పులతడకగా మారడంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. మధిరలోని వర్తక సంఘం సమీపాన నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తమ్మారపు నాగమణి ఇంట్లో సోమవారం విద్యుత్‌శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. స్కానింగ్ మిషన్ ద్వారా రీడింగ్ తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో మీటర్ రీడింగ్ కూడా చేరడంతో 3090110116 సర్వీస్‌కు రూ.76,46,657గా బిల్లు వచ్చింది.
రెండు మీటర్లు కలిసినా 76 లక్షలకు పైగా బిల్లు రావడమేమిటని బాధితులు ఆందోళన చెం దారు. దీంతో సిబ్బం ది మరో స్కా నింగ్ మిషన్ తీసుకొచ్చి రీడింగ్ తీస్తే బిల్లు రూ.58 మాత్రమే వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. స్కానింగ్‌మిషన్లలో అవకతవకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment