మీటర్‌ రీడింగ్‌ లేనట్టే! | March Electricity Bill Based On Average Usage | Sakshi
Sakshi News home page

మీటర్‌ రీడింగ్‌ లేనట్టే!

Published Fri, Apr 3 2020 2:49 AM | Last Updated on Fri, Apr 3 2020 2:49 AM

March Electricity Bill Based On Average Usage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్చి నెల విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులను మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా కాకుండా కొత్త పద్ధతిలో జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందు తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మీటర్‌ రీడింగ్‌ తీయకుం డానే ప్రత్యామ్నాయ పద్ధతిలో గత నెల వినియోగానికి సంబంధించిన బిల్లులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వినియోగ దారులు సగటున నెలకు ఎంత విద్యుత్‌ వినియో గిస్తున్నారన్న విషయాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంచనా వేసి మార్చి నెలకు సంబంధిం చిన విద్యుత్‌ బిల్లులు జారీ చేయాలని భావిస్తు న్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రా వు.. డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌ రావుతో గురువారం విద్యుత్‌ సౌధలో సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మీటర్‌ రీడింగ్‌కు బదులు వినియోగదారుల సగటు విద్యుత్‌ వినియోగం ఆధారంగా మార్చి నెలకు సంబంధించిన బిల్లులు వసూలు చేయాలని ఈ సమావేశంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

కచ్చితత్వంతో జారీ..!
సగటున ఒక నెల విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేస్తే విద్యుత్‌ టారిఫ్‌లోని శ్లాబులు తారుమారై వినియోగదారులపై అధిక భారం పడటమో, లేకుంటే డిస్కంలు ఆర్థికంగా నష్ట పోవడమో జరిగే అవకాశాలున్నాయి. ఈ నేప థ్యంలో ఇటు వినియోగదారులు అటు డిస్కంలు నష్టపోకుండా సాధ్యమైనంత వరకు కచ్చితమైన అంచనాలతో బిల్లులు జారీ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు అధికా రవర్గాలు తెలిపాయి. శుక్రవారం మరోసారి సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశ ముం దని, ఆ వెంటనే డిస్కంలు ఈ మేరకు సగటు వినియోగం ఆధారంగా విద్యుత్‌ బిల్లుల జారీకి అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాయనున్నాయి. ఈఆర్సీ అనుమతించిన వెంటనే విని యోగదా రులకు ప్రత్యామ్నాయ పద్ధతిలో బిల్లు లు జారీ చేయనున్నారు. మార్చి నెలకు సంబం ధించి వచ్చిన బిల్లు.. చెల్లించాల్సిన గడువు వివరాలతో వినియోగదారుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ సైతం పంపించనున్నారు. దీనిపై శుక్రవారం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశముంది.

ఆన్‌లైన్‌లో చెల్లించండి..
విద్యుత్‌ వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా పాత బకాయిలు చెల్లించాలని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కోరారు. లాక్‌ డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులు నేరుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించడం సాధ్యం కానందువల్ల ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలోని బిల్లులే కాకుండా గతంలో వినియోగించిన విద్యుత్‌ బకాయిలు కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ బకాయిలను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని కోరారు. లాక్‌డౌన్‌ అమలవుతున్నా విద్యుత్‌ సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్‌ అందిస్తున్నాయని చెప్పారు. ఈ సదుపాయం నిరాటంకంగా కొనసాగడానికి వినియోగదారులు బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement