
సాక్షి, చొప్పదండి(కరీంనగర్) : ప్రతి రెండు నెలలకు ఐదు వందల నుంచి వేయి లోపు రావాల్సిన కరెంట్ బిల్లు ఒకేసారి పదకొండు వేలు రావడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరపు సంతోష్‌కుమార్‌కు సర్వీస్ నంబర్ 722పై విద్యుత్ కనెక్షన్ ఉంది. ప్రతీ రెండునెలలకోసారి బిల్లు ఐదు వందల రూపాయల నుంచి వేయి వచ్చేది. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు మీటర్ రీడింగ్ 1285 యూనిట్లు తిరిగినట్లు రూ.11 వేల 2 రూపాయలు చెల్లించాలని బిల్లు తీసి అందించారు. మీటర్ తీసుకున్నప్పటి నుంచి ఏనాడు వేయి దాటని బిల్లు ఇంతపెద్దమొత్తంలో రావడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment