
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో విద్యుత్ మీటర్లు వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ మీటర్లు కనెక్షన్ లేకుండానే రీడింగ్ తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యుత్ కనెక్షన్ తొలగించి విద్యుత్ మీటర్లు చేతితో పట్టుకుంటే చాలు రీడింగ్ తిరుగుతున్నాయి. దీనిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మీటర్లతో ప్రజలకు విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment