![Sridevi Soda Center Team Visits Eluru Ambica Theatre - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/09/1/sudheer-babu.jpg.webp?itok=ZsHffXUy)
అంబికా థియేటర్‌లో ప్రేక్షకులతో మాట్లాడుతున్న హీరో సుదీర్ బాబు
సాక్షి,ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం తన జీవితంలో ఒక తీపి జ్ఞాపకాన్ని ఇచ్చిందని ఆ చిత్ర హీరో సుదీర్ బాబు అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న అంబికా థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. తొలుత చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ఎలా ఉంది అని అడిగి వారి నుంచి సానుకూల సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా హీరో సుదీర్‌బాబు చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను అలరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో మాట్లాడుతూ చిత్రం తాము ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచుతూ వారి ఆదరణ పొందుతోందన్నారు. ఈ విజయం స్ఫూర్తిగా మరిన్ని విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. దర్శకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ తమ చిత్రంలో సుదీర్‌బాబు నటన హైలెట్‌గా నిలిచిందన్నారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా చిత్రాన్ని వినోదాత్మకంగా నిర్మించామని, విడుదలైన అన్ని సెంటర్లలో చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, వర్షాలు, కోవిడ్ భయం వెంటాడుతున్నా తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. థియేటర్ మేనేజర్ రఘు, జీఎం వెంకట్, సుదీర్‌కుమార్ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment