దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈకార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 8.00 గంటలకు బళ్లారి చౌరస్తాలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
అనంతరం బళ్లారి చౌరస్తా నుంచి వైఎస్‌ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజే షాపింగ్ మాల్‌లోని పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు, ఆతర్వాత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరిచి నివాళి అర్పిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు శనివారం ఓ ప్రకటనలో విజ్ఙప్తి చేశారు.
కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో..
కర్నూలు (ఓల్డ్‌సిటీ): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కళావెంకట్రావ్ భవనంలో ఘనంగా నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి తెలిపారు. ఉదయం 10.00 గంటలకు పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి, 10.30 గంటలకు ఎస్‌బీఐ సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో అలంకరిస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు.
సేవ కార్యక్రమాలకు ఏర్పాట్లు
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటలకు ఎస్‌బీఐ కూడలిలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం టీజే షాపింగ్‌మాల్‌లోని పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు.
అనంతరం ఉదయం 10.30 గంటలకు బీక్యాంపు బస్టాండ్‌లో వికలాంగులకు బెడ్‌షీట్ల పంపిణీ, 11 గంటలకు జనరల్ హాస్పిటల్ టీబీ వార్డులో రోగులకు బ్రెడ్లు పంపిణీ, 11.15 గంటలకు చిన్న పిల్లల వార్డులోని చిన్నారులకు బ్రెడ్డు, పాలు, పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం కీర్తన అనాథ శరణాలయంలో అన్నదానం చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాలను పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment