సాక్షి, రామచంద్రాపురం : నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజన్న తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ట్విటర్‌లో స్పందించారు. తండ్రి వైఎస్సార్ జయంతి రోజే నేను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండటం కేవలం యాధృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు వైఎస్సార్ ఆశీస్సులు కూడా నాకు ప్రతిబింబించేలా ఉంది. స్వర్గం నుంచి నాన్న వైఎస్సార్ ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్‌డే నాన్న. ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు’ అని వైఎస్ జగన్ ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేడు 208వ రోజు ప్రారంభమైంది. అశేష జనవాహిని తరలిరాగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య వైఎస్ జగన్ తన పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.
The 2500KM milestone falling on YSR garu's birthday is not a mere coincidence. It shows that this #PrajaSankalpaYatra is blessed not only by the people of AP, but also YSR himself from the heaven above! Happy birthday, nanna. Thank you for always being with us.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 8 July 2018
Comments
Please login to add a commentAdd a comment