స్ఫూర్తి నడిపిస్తుంది. నడత నడక నేర్పిస్తుంది. స్మృతులు పాద ముద్రలు. బాట ఒక పాఠం. నడిచిన చరిత్ర కళనీ కదిలిస్తుంది. కళ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్మృతి యాత్ర అందరికీ స్ఫూర్తి యాత్ర కావాలని నటుడు మమ్ముట్టి అంటున్నారు.
‘యాత్ర’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది...
మమ్ముట్టి : (నవ్వుతూ). నాదేం లేదు. మా టీమ్ అంతా కష్టపడుతున్నాం. అలాగే ఇది బయోపిక్ అని మక్కీకి మక్కీ దించాలనుకోవడంలేదు. వైయస్సార్‌గారిని నేను అర్థం చేసుకుని చేస్తున్నాను. ఆయన పాత్ర చేస్తున్నాను కాబట్టి, ఆయన మేనరిజమ్స్ నాలో కనిపించాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటివి ఉంటాయి. అయితే ఆయనలానే ఉంటాయని చెప్పలేను. వైయస్సార్‌గారి క్యారెక్టర్ తీసుకొని కథ చెబుతున్నాం. ఆ కథలో నేను కనిపిస్తాను.
ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ మహీ, నిర్మాత విజయ్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏమనుకున్నారు?
మమ్ముట్టి: యాక్చువల్లీ మహీ నాకు బయోపిక్ అని చెప్పలేదు. నిజానికి ఇది వైయస్సార్‌గారి జీవిత చరిత్ర కాదు. ‘యాత్ర’ సినిమా ఆయన ౖలైఫ్‌లో జరిగిన ఒక చాప్టర్. ఆయన చేసిన పాద యాత్ర మీద ఈ సినిమా ఫోకస్ ఉంటుంది. వైయస్సార్‌గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయింది, ఓ లీడర్‌గా జనాల్లోకి వెళ్లి, ఆయన ఎలా ఇంటరాక్ట్ అయ్యారన్నది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ విషయాలు చెప్పినప్పుడు ఒక యాక్టర్‌గా చాలా ఎగై్జట్ అయ్యాను.
దర్శకుడిగా మహీవి రెండు మూడు సినిమాలే కదా. ఆ విషయంలో ఏమైనా సెకండ్ థాట్ ఉండేదా?
మమ్ముట్టి: స్క్రిప్ట్ అంత బావున్నప్పుడు ఎందుకు సంకోచిస్తాను? నో అని చెప్పడానికి వీలు లేనంత బాగుంది. మహీ చేసిన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. నా మీద అతని కాన్ఫిడెన్స్ చూసి, అతని కాన్ఫిడెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.
మహీ: యాక్చువల్లీ డైలాగ్స్‌ని తెలుగులో చదవమన్నారు. ఫుల్ నరేషన్ కూడా తెలుగులోనే జరిగింది. ఆ డైలాగ్స్ అన్నింటినీ మలయాళంలో రాసుకున్నారు. దానికి 15 రోజులు పట్టింది.
ఈ సినిమా ఒప్పుకున్నాక వైయస్సార్ గారి గురించి తెలుసుకున్నారా?
మమ్ముట్టి: ఇప్పటి పొలిటీషియనే కాబట్టి నాకు ఆయన గురించి కొంచెం అవగాహన ఉంది. లుక్స్, గెటప్స్ అన్నీ టీమ్ చూసుకున్నారు. రిఫరెన్స్ కోసం రాజశేఖర్‌రెడ్డిగారి పొలిటికల్ వీడియోలు చూస్తే ఆ ప్రభావం నా మీద ఎక్కువ పడిపోతుంది. అందుకే నేను జస్ట్ ఒకట్రెండు యూట్యూబ్ క్లిప్స్ మాత్రమే చూశాను. వైయస్సార్‌లా ఎంత సిమిలర్‌గా కనపడతానో తెలియదు. ఆయన స్పీచ్‌ను కూడా ఇమిటేట్ చేయడం కాదు, వైయస్సార్‌గారు తెలియని వాళ్లు కూడా అప్రిషియేట్ చేయాలి. మా ప్రయత్నం అదే. సినిమా స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయింది కాబట్టి ఎక్కువ విషయాలు బయటపెట్టకూడదని అనుకుంటున్నాను.
మహీ: ఈ స్టోరీలో వైయస్సార్ గారి సోల్ అండ్ స్పిరిట్ ఉంటుంది. ఆయన జర్నీ మీద ఉంటుంది. మమ్ముట్టి సార్ చెప్పినట్టు వైయస్సార్‌గారి జీవితాన్ని మక్కీకి మక్కీ తీయడంలేదు. ఆయన లైఫ్‌లోని ఒక ఇంపార్టెంట్ చాప్టర్‌ని డిస్కస్ చేస్తున్నాం.
పాదయాత్ర మీదే తీయాలనుకోవడానికి కారణం?
మమ్ముట్టి: యాత్ర అంటే అందరికీ పేపర్‌లో న్యూసే తెలుసు. ఈరోజు ఇన్ని కిలోమీటర్లు నడిచారని చదివి తెలుసుకుంటారు. ఆ నడక వెనకాల రియల్‌గా అక్కడేం జరిగింది... ప్రతీ ఒక్కరితో వైయస్సార్‌గారు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? అన్నది కూడా ఇందులో చూపించబోతున్నాం. ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్‌ను చూపించనున్నాం.
మహీ: మేం ‘యాత్ర’ను ఓ డాక్యుమెంటరీలా తీయడంలేదు. అలాగని బాగా డ్రమటైజ్ కూడా చేయడం లేదు. సినిమా చూసే ప్రతి ఒక్కరినీ హత్తుకునే ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన 3, 4 నిమిషాల్లోనే ఆడియన్స్ కథలోకి వెళ్లిపోయేట్లు తీస్తున్నాం.
మమ్ముట్టి గారే ఈ పాత్రకు సరిపోతారని మీకెలా అనిపించింది?
మహీ: ‘దళపతి’ దగ్గర నుంచి మమ్ముట్టి సార్ సినిమాలు ఫాలో అవుతున్నాను. ఒక మనిషి నిల్చున్నా, కూర్చున్నా తనతో పాటు ఒక లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీని క్యారీ చేయగలగాలి. వైయస్సార్‌గారికి ఆ చరిష్మా ఉంది. వైయస్సార్ గారు మామూలుగా నడిచినా అది తన సొంత ప్లేస్ అనుకొనేంత ధీమాగా నడవగలరు. చేయి అలా గాల్లో ఊపితే ఓ భరోసా కనిపిస్తుంది. వంద మందిలో ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు తనవాళ్లని, అది తన ప్లేస్ అనిపించేంత చరిష్మా ఆయనలో కనిపిస్తుంది. మమ్ముట్టి గారిలో కూడా ఆ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉందనిపించింది. వైయస్‌గారిలా ఆయన్ను ఊహించుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది.
విజయ్ చిల్లా: మహీ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నా మైండ్‌లో ఫస్ట్ తట్టిన వ్యక్తి కూడా మమ్ముట్టిగారే.
వైయస్సార్ గారి మీద సినిమా తీయాలని మీకు ఎప్పుడనిపించింది?
మహీ: 2011లో ఈ ఐడియా వచ్చింది. ‘ఆనందో బ్రహ్మ’ ముందు అనుకున్నాను. వైయస్‌గారి లైఫ్ హిస్టరీ అంతా కవర్ చేయాలని అనుకోలేదు. ఆయన లైఫ్‌లో జరిగిన ఒక చాప్టర్ చుట్టూ కథ రాశాను. వైయస్సార్‌గారి లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ అంటే పాదయాత్రే. మనందరికీ కూడా ముందు గుర్తొచ్చేది పాదయాత్రే. అందుకే ఆ యాత్ర చుట్టూ సినిమా ప్లాన్ చేశాను. బహుశా ఇలాంటిది ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటున్నాను.
మమ్ముట్టి: ఆడియన్స్‌కి వైయస్సార్‌గారు ఓ లీడర్‌గానే తెలుసు. కానీ ఈ సినిమా ద్వారా ఆయన పర్సనల్‌గా ఎలా ఉంటారో అందరికీ తెలుస్తుంది.
షూటింగ్‌లో మెమొరబుల్ మూమెంట్ ఏదైనా..?
మమ్ముట్టి: షూటింగ్ స్టార్ట్ అయి టెన్ డేసే అయింది. ఈ పది రోజులు కూడా మెమొరబుల్ అని అంటాను.
మీ అబ్బాయి దుల్కర్‌గారు బయోపిక్‌తోనే (‘మహానటి’) ఇటీవల తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. మీరు కూడా మళ్లీ బయోపిక్‌తోనే రీ–ఎంట్రీ ఇస్తున్నారు.
మమ్ముట్టి: అది వేరే ఇది వేరే (నవ్వుతూ).
విజయ్ చిల్లా: యాక్చువల్లీ ‘మహానటి’కన్నా ముందే ఈ సినిమా ప్లాన్ చేసేశాం.
టోటల్ షూటింగ్ డేస్ ఎన్ని అనుకున్నారు?
విజయ్: వైయస్‌గారు 68 రోజులు పాదయాత్ర చేశారు. మేం ఇంకో రెండు రోజులు కలిపి 70 రోజుల్లో సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓ నాలుగైదు రోజుల షూటింగ్ మినహా మమ్ముట్టిగారు మొత్తం ఉంటారు.
మమ్ముట్టి: సినిమా మొత్తం ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వేరే సినిమాలు చేస్తే ఇందులో నుంచి బయటకు వచ్చేస్తామో అని. అలా డీవియేట్ అవకూడదని ముందే అనుకున్నాను. ఓ ఎక్స్‌పీరియన్డ్స్ ఆర్టిస్ట్‌గా వేరే సినిమాలు చేసుకుంటూ, ఈ సినిమా చేస్తూ మ్యానేజ్ చేయొచ్చు కానీ, ఈ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి డిస్ట్రబెన్స్ ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడిప్పుడే తెలుగు లాంగ్వేజ్‌తో కొంచెం ఫెమీలియర్ అవుతున్నాను కదా... త్వరలోనే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తాం.
గతంలో ‘స్వాతి కిరణం’ అవీ చేసినప్పుడు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా?
మమ్ముట్టి: అలా కాకపోతే సినిమాలు చేయను. నా సినిమాల్లో నా గొంతే వినపడాలి. నా దృష్టిలో ఏ ఆర్టిస్ట్ అయినా తన గొంతు కూడా వినిపించినప్పుడే ‘యాక్టర్’ అనిపించుకుంటారని నా ఫీలింగ్.
మహీ : అవును. ‘స్వాతి కిరణం’ వంటి సినిమాలకు మమ్ముట్టిగారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమా డైలాగ్స్‌తో పోల్చితే ‘స్వాతి కిరణం’ కాంప్లికేటెడ్. అయినా బాగా చెప్పారు. ఈ సినిమాలో సింపుల్ లాంగ్వేజ్‌తో, క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి. పొలిటికల్ స్పీచ్‌లు కూడా ఉంటాయి.
మమ్ముట్టి: తెలుగు డైలాగ్స్ అన్నీ మలయాళంలో రాసుకోవడం వల్ల ఈజీ అయింది. బాగా చదువుకుంటున్నా (నవ్వుతూ). ఈజీగా చెప్పేస్తున్నా.
విజయ్: అది చాలా పెద్ద ఎఫర్ట్. ఆల్రెడీ మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్‌లోను రోజుకో గంట ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయడం చిన్న విషయం కాదు.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెలుగుకు తిరిగి రావడం ఎలా ఉంది?
మమ్ముట్టి: చాలా చేంజెస్ కనిపించాయి. ఆయినా ఫుల్‌గా ఇక్కడికి వచ్చినట్టు కాదు. నేను బయటే ఉన్నాను. వచ్చి సినిమా చేసి, వెళ్లిపోతున్నాను.
మమ్ముట్టిగారి లుక్ టెస్ట్ జరిగాక దర్శక–నిర్మాతలుగా మీ ఫీలింగ్?
విజయ్: మాకు ఎగై్జటింగ్‌గా అనిపించింది. మమ్ముట్టిగారు గాల్లోకి అలా చెయ్యెత్తగానే చాలా ఎగై్టట్ అయ్యాం. మనకి ఇద్దరూ (వైయస్సార్, మమ్ముట్టి) తెలుసు. వైయస్సార్‌గారిని చూశాం. నటుడిగా మమ్ముట్టిగారిని ఎన్నో పాత్రల్లో చూశాం. వైయస్సార్‌గారి పాత్రలో ఆయన్ను చూడటం ఓ స్పెషల్ ఫీలింగ్.
మహీ: ఆ ఫీలింగ్‌ని మాటల్లో చెప్పడం కష్టం.
వైయస్‌ని పర్సనల్‌గా ఎప్పుడైనా కలిశారా?
మమ్ముట్టి: లేదు.
మహీగారూ.. ఈ కథ రాసే ముందు మీరు చేసిన రిసెర్చ్ గురించి?
మహీ: నేను వైయస్‌గారి ఫ్యామిలీ అందరితో మాట్లాడాను. స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి తొమ్మిది నెలలు పట్టింది. స్పెసిఫిక్‌గా ఈ టైమ్‌లో కథ రాయడం మొదలుపెట్టానని చెప్పను. ఐదారేళ్లుగా బిట్స్ బిట్స్‌గా రాసుకుంటూ వచ్చాను. నాకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించినవన్నీ రాశాను. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అన్నింటినీ కలిపి స్క్రిప్ట్‌ని ఓ స్ట్రక్చర్‌కి తీసుకొచ్చాం.
ఫైనల్లీ సినిమా బడ్జెట్ ఎంత అనుకున్నారు?
విజయ్: సుమారు 30 కోట్లు అనుకుంటున్నాం. వైయస్ లాంటి గొప్ప లీడర్ సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాం.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment