Mahi
-
తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు.. ఎవరో గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అంటే నమ్ముతారా? తల్లయినా తన అందాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోందీ బ్యూటీ. 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్ చేసింది. 2006లో నటనారంగంలో అడుగుపెట్టింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా...? తన పేరు వీజే మహి వినోద్. ఒకప్పుడు హీరోయిన్.. ఎవరైనా సీరియల్స్ నుంచి సినిమాలకు వెళ్తారు. కానీ ఈ నటి జర్నీ మాత్రం అందుకు రివర్స్‌గా ఉంటుంది. 2004లో తపన అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. అదే ఏడాది అపరిచితన్ అనే మలయాళ మూవీ కూడా చేసింది. తర్వాత అవకాశాలే రాకపోవడంతో రెండేళ్లు ఎదురుచూసి సీరియల్లో నటించింది. ఆ తర్వాత 2008లో కన్నడలో ఓ సినిమా చేసి పూర్తిగా బుల్లితెరపైనే సెటిలైంది. రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ 2020 తర్వాత మరే షోలోనూ కనిపించనేలేదు. ముగ్గురు పిల్లల బాధ్యత తనదే ఆమె పర్సనల్ విషయానికి వస్తే మహి 2011లో నటుడు జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు సంతానం. అలాగే రాజ్వీర్, ఖుషి అనే ఇద్దరు పిల్లలను పెంచి పోషిస్తోంది. వారికి అమ్మానాన్న ఉండటంతో దత్తత తీసుకోలేదు కానీ తరచూ ఆ పిల్లల్ని కలుసుకుంటూ ఉంటుంది. వారి పెంపకం, విద్య.. అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకుంది. తన మంచి మనసుకు ఫిదా అయిన ఫ్యాన్స్ తిరిగి ఆమె సినిమాల్లోకి వస్తే బాగుండని ఆశపడుతున్నారు. View this post on Instagram A post shared by @khushiray2014 చదవండి: టిల్లు స్క్వేర్: శ్రీసత్యకు అన్యాయం! సిద్ధుతో నటించిన సీన్స్ ఎక్కడ? -
వాళ్లను వదిలేయలేదు.. ముగ్గురూ సమానమే: నటి
ముంబై: దత్తత తీసుకున్న పిల్లల పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, కన్న కూతురితో సమానంగా వాళ్లకు ప్రేమను పంచుతున్నామన్నారు టీవీ నటి మహి విజ్. వాళ్లను వదిలేశామని, పట్టించుకోవడం లేదన్న వార్తలు తమను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2011లో వివాహ బంధంతో ఒక్కటైన హిందీ టీవీ స్టార్ కపుల్ మహి విజ్-జై భనుశాలిలకు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. ఈ క్రమంలో 2017లో తమ పనిమనిషి పిల్లల(రాజీవ్, ఖుషి)ను దత్తత తీసుకున్నారు. అయితే, తొలుత కొన్నాళ్లపాటు వీరి ఇంట్లోనే ఉన్న రాజీవ్, ఖుషి తర్వాత కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నారు. మహి- జై వారి ఆ చిన్నారుల పెంపకం, విద్యకు సంబంధించిన ఖర్చులు భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూతురు తార(2 ఏళ్లు) పుట్టిన తర్వాత ఈ జంట, రాజీవ్- ఖుషిలను పూర్తిగా వదిలేశారని, వారికి దూరంగా ఉంటున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్థార్థపరులైన మహి- జైలను ఇకపై ఫాలో అవ్వమంటూ విద్వేషపు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మహి విజ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు.. ‘‘చాలా మంది రాజీవ్, ఖుషిలను వదిలేశారా అని అడుగుతున్నారు. మేం వాళ్లకు తల్లిదండ్రులం. వారి బాగోగులు చూసుకునే బాధ్యత మాపై ఉంది. తార వచ్చిన తర్వాత మా జీవితాలు మరింత అందంగా మారాయి. రాజీవ్, ఖుషీలకు మరో తోడు దొరికింది. అంతేకానీ వారి ముగ్గురి పట్ల మా ప్రేమలో ఎలాంటి తేడా లేదు. వాళ్లు ప్రస్తుతం వారి స్వస్థలంలో ఉన్నారు. మేం రోజూ వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉన్నాం. వారి సౌకర్యాన్ని బట్టి నచ్చిన సమయంలో నచ్చిన చోట ఉంటారు. పండుగలన్నీ మేమంతా కలిసే చేసుకుంటాం. మాకు ముగ్గురు పిల్లలు అన్న విషయం ఎన్నటికీ మర్చిపోం. వాళ్లకు మీ ఆశీర్వాదాలు కావాలి. అంతేగానీ, మా ప్రేమను శంకించవద్దు. దయచేసి, మా వ్యక్తిగత జీవితం గురించి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు మహికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత అంటే, 2019లో మహి- జైకి కూతురు తార జన్మించింది. ఇక వీరిద్దరు టీవీ రియాలిటీ షో ‘నచ్ బలియే 5’లో పాల్గొని టైటిల్ గెలుచుకుని ప్రాచుర్యం పొందారు. కాగా తెలుగులో డబ్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా మహి విజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది! చదవండి: 16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?! View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) -
విజేతల యాత్ర
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడమే ఒక విజయం. ‘విన్నర్స్ ట్రిప్’ టీమ్ సంతోషం చూస్తుంటే కచ్చితంగా గెలవాలనే తపనతోనే ఈ సినిమా తీశారనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే యూనిట్ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నమ్ముతున్నా’’ అని నటుడు బాబూమోహన్ అన్నారు. మహి, సోనా పాటిల్ జంటగా శ్రీను తెలుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విన్నర్స్ ట్రిప్’. శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్ఎస్సి క్రియేషన్స్ పతాకంపై సంపత్ శ్రీను, కె. లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బాబూమోహన్ విడుదల చేశారు. సంపత్ శ్రీను మాట్లాడుతూ– ‘‘మా సినిమా 30 రోజులు టాకీ, 10రోజులు పాటల చిత్రీకరణంతా గోవాలోనే పూర్తి చేశాం. ఎడిటర్ ఈశ్వర్ మా చిన్న సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లారు’’ అన్నారు. ‘‘ఒక ఎఫ్ఎమ్ రేడియో పోటీ విజేతలను ఒక ట్రిప్‌కి తీసుకెళ్లగా అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుండి ఎంతమంది బయటపడ్డారు? అనేది చిత్రకథాంశం’’ అన్నారు తెలుగు శ్రీను. మహి, సోనా పాటిల్, ప్రసన్నకుమార్ మాట్లాడారు. -
యాత్ర : మమ్ముట్టితో ప్రత్యేక ఇంటర్వ్యూ
స్ఫూర్తి నడిపిస్తుంది. నడత నడక నేర్పిస్తుంది. స్మృతులు పాద ముద్రలు. బాట ఒక పాఠం. నడిచిన చరిత్ర కళనీ కదిలిస్తుంది. కళ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్మృతి యాత్ర అందరికీ స్ఫూర్తి యాత్ర కావాలని నటుడు మమ్ముట్టి అంటున్నారు. ‘యాత్ర’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది... మమ్ముట్టి : (నవ్వుతూ). నాదేం లేదు. మా టీమ్ అంతా కష్టపడుతున్నాం. అలాగే ఇది బయోపిక్ అని మక్కీకి మక్కీ దించాలనుకోవడంలేదు. వైయస్సార్‌గారిని నేను అర్థం చేసుకుని చేస్తున్నాను. ఆయన పాత్ర చేస్తున్నాను కాబట్టి, ఆయన మేనరిజమ్స్ నాలో కనిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటివి ఉంటాయి. అయితే ఆయనలానే ఉంటాయని చెప్పలేను. వైయస్సార్‌గారి క్యారెక్టర్ తీసుకొని కథ చెబుతున్నాం. ఆ కథలో నేను కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ మహీ, నిర్మాత విజయ్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏమనుకున్నారు? మమ్ముట్టి: యాక్చువల్లీ మహీ నాకు బయోపిక్ అని చెప్పలేదు. నిజానికి ఇది వైయస్సార్‌గారి జీవిత చరిత్ర కాదు. ‘యాత్ర’ సినిమా ఆయన ౖలైఫ్లో జరిగిన ఒక చాప్టర్. ఆయన చేసిన పాద యాత్ర మీద ఈ సినిమా ఫోకస్ ఉంటుంది. వైయస్సార్‌గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయింది, ఓ లీడర్‌గా జనాల్లోకి వెళ్లి, ఆయన ఎలా ఇంటరాక్ట్ అయ్యారన్నది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ విషయాలు చెప్పినప్పుడు ఒక యాక్టర్‌గా చాలా ఎగై్జట్ అయ్యాను. దర్శకుడిగా మహీవి రెండు మూడు సినిమాలే కదా. ఆ విషయంలో ఏమైనా సెకండ్ థాట్ ఉండేదా? మమ్ముట్టి: స్క్రిప్ట్ అంత బావున్నప్పుడు ఎందుకు సంకోచిస్తాను? నో అని చెప్పడానికి వీలు లేనంత బాగుంది. మహీ చేసిన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. నా మీద అతని కాన్ఫిడెన్స్ చూసి, అతని కాన్ఫిడెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మహీ: యాక్చువల్లీ డైలాగ్స్‌ని తెలుగులో చదవమన్నారు. ఫుల్ నరేషన్ కూడా తెలుగులోనే జరిగింది. ఆ డైలాగ్స్ అన్నింటినీ మలయాళంలో రాసుకున్నారు. దానికి 15 రోజులు పట్టింది. ఈ సినిమా ఒప్పుకున్నాక వైయస్సార్ గారి గురించి తెలుసుకున్నారా? మమ్ముట్టి: ఇప్పటి పొలిటీషియనే కాబట్టి నాకు ఆయన గురించి కొంచెం అవగాహన ఉంది. లుక్స్, గెటప్స్ అన్నీ టీమ్ చూసుకున్నారు. రిఫరెన్స్ కోసం రాజశేఖర్‌రెడ్డిగారి పొలిటికల్ వీడియోలు చూస్తే ఆ ప్రభావం నా మీద ఎక్కువ పడిపోతుంది. అందుకే నేను జస్ట్ ఒకట్రెండు యూట్యూబ్ క్లిప్స్ మాత్రమే చూశాను. వైయస్సార్‌లా ఎంత సిమిలర్‌గా కనపడతానో తెలియదు. ఆయన స్పీచ్‌ను కూడా ఇమిటేట్ చేయడం కాదు, వైయస్సార్‌గారు తెలియని వాళ్లు కూడా అప్రిషియేట్ చేయాలి. మా ప్రయత్నం అదే. సినిమా స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయింది కాబట్టి ఎక్కువ విషయాలు బయటపెట్టకూడదని అనుకుంటున్నాను. మహీ: ఈ స్టోరీలో వైయస్సార్ గారి సోల్ అండ్ స్పిరిట్ ఉంటుంది. ఆయన జర్నీ మీద ఉంటుంది. మమ్ముట్టి సార్ చెప్పినట్టు వైయస్సార్‌గారి జీవితాన్ని మక్కీకి మక్కీ తీయడంలేదు. ఆయన లైఫ్‌లోని ఒక ఇంపార్టెంట్ చాప్టర్‌ని డిస్కస్ చేస్తున్నాం. పాదయాత్ర మీదే తీయాలనుకోవడానికి కారణం? మమ్ముట్టి: యాత్ర అంటే అందరికీ పేపర్లో న్యూసే తెలుసు. ఈరోజు ఇన్ని కిలోమీటర్లు నడిచారని చదివి తెలుసుకుంటారు. ఆ నడక వెనకాల రియల్‌గా అక్కడేం జరిగింది... ప్రతీ ఒక్కరితో వైయస్సార్‌గారు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? అన్నది కూడా ఇందులో చూపించబోతున్నాం. ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్‌ను చూపించనున్నాం. మహీ: మేం ‘యాత్ర’ను ఓ డాక్యుమెంటరీలా తీయడంలేదు. అలాగని బాగా డ్రమటైజ్ కూడా చేయడం లేదు. సినిమా చూసే ప్రతి ఒక్కరినీ హత్తుకునే ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన 3, 4 నిమిషాల్లోనే ఆడియన్స్ కథలోకి వెళ్లిపోయేట్లు తీస్తున్నాం. మమ్ముట్టి గారే ఈ పాత్రకు సరిపోతారని మీకెలా అనిపించింది? మహీ: ‘దళపతి’ దగ్గర నుంచి మమ్ముట్టి సార్ సినిమాలు ఫాలో అవుతున్నాను. ఒక మనిషి నిల్చున్నా, కూర్చున్నా తనతో పాటు ఒక లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీని క్యారీ చేయగలగాలి. వైయస్సార్‌గారికి ఆ చరిష్మా ఉంది. వైయస్సార్ గారు మామూలుగా నడిచినా అది తన సొంత ప్లేస్ అనుకొనేంత ధీమాగా నడవగలరు. చేయి అలా గాల్లో ఊపితే ఓ భరోసా కనిపిస్తుంది. వంద మందిలో ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు తనవాళ్లని, అది తన ప్లేస్ అనిపించేంత చరిష్మా ఆయనలో కనిపిస్తుంది. మమ్ముట్టి గారిలో కూడా ఆ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉందనిపించింది. వైయస్గారిలా ఆయన్ను ఊహించుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. విజయ్ చిల్లా: మహీ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నా మైండ్‌లో ఫస్ట్ తట్టిన వ్యక్తి కూడా మమ్ముట్టిగారే. వైయస్సార్ గారి మీద సినిమా తీయాలని మీకు ఎప్పుడనిపించింది? మహీ: 2011లో ఈ ఐడియా వచ్చింది. ‘ఆనందో బ్రహ్మ’ ముందు అనుకున్నాను. వైయస్‌గారి లైఫ్ హిస్టరీ అంతా కవర్ చేయాలని అనుకోలేదు. ఆయన లైఫ్‌లో జరిగిన ఒక చాప్టర్ చుట్టూ కథ రాశాను. వైయస్సార్‌గారి లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ అంటే పాదయాత్రే. మనందరికీ కూడా ముందు గుర్తొచ్చేది పాదయాత్రే. అందుకే ఆ యాత్ర చుట్టూ సినిమా ప్లాన్ చేశాను. బహుశా ఇలాంటిది ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటున్నాను. మమ్ముట్టి: ఆడియన్స్‌కి వైయస్సార్‌గారు ఓ లీడర్‌గానే తెలుసు. కానీ ఈ సినిమా ద్వారా ఆయన పర్సనల్‌గా ఎలా ఉంటారో అందరికీ తెలుస్తుంది. షూటింగ్లో మెమొరబుల్ మూమెంట్ ఏదైనా..? మమ్ముట్టి: షూటింగ్ స్టార్ట్ అయి టెన్ డేసే అయింది. ఈ పది రోజులు కూడా మెమొరబుల్ అని అంటాను. మీ అబ్బాయి దుల్కర్గారు బయోపిక్‌తోనే (‘మహానటి’) ఇటీవల తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. మీరు కూడా మళ్లీ బయోపిక్‌తోనే రీ–ఎంట్రీ ఇస్తున్నారు. మమ్ముట్టి: అది వేరే ఇది వేరే (నవ్వుతూ). విజయ్ చిల్లా: యాక్చువల్లీ ‘మహానటి’కన్నా ముందే ఈ సినిమా ప్లాన్ చేసేశాం. టోటల్ షూటింగ్ డేస్ ఎన్ని అనుకున్నారు? విజయ్: వైయస్‌గారు 68 రోజులు పాదయాత్ర చేశారు. మేం ఇంకో రెండు రోజులు కలిపి 70 రోజుల్లో సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓ నాలుగైదు రోజుల షూటింగ్ మినహా మమ్ముట్టిగారు మొత్తం ఉంటారు. మమ్ముట్టి: సినిమా మొత్తం ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వేరే సినిమాలు చేస్తే ఇందులో నుంచి బయటకు వచ్చేస్తామో అని. అలా డీవియేట్ అవకూడదని ముందే అనుకున్నాను. ఓ ఎక్స్పీరియన్డ్స్ ఆర్టిస్ట్‌గా వేరే సినిమాలు చేసుకుంటూ, ఈ సినిమా చేస్తూ మ్యానేజ్ చేయొచ్చు కానీ, ఈ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి డిస్ట్రబెన్స్ ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడిప్పుడే తెలుగు లాంగ్వేజ్‌తో కొంచెం ఫెమీలియర్ అవుతున్నాను కదా... త్వరలోనే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. గతంలో ‘స్వాతి కిరణం’ అవీ చేసినప్పుడు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? మమ్ముట్టి: అలా కాకపోతే సినిమాలు చేయను. నా సినిమాల్లో నా గొంతే వినపడాలి. నా దృష్టిలో ఏ ఆర్టిస్ట్ అయినా తన గొంతు కూడా వినిపించినప్పుడే ‘యాక్టర్’ అనిపించుకుంటారని నా ఫీలింగ్. మహీ : అవును. ‘స్వాతి కిరణం’ వంటి సినిమాలకు మమ్ముట్టిగారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమా డైలాగ్స్‌తో పోల్చితే ‘స్వాతి కిరణం’ కాంప్లికేటెడ్. అయినా బాగా చెప్పారు. ఈ సినిమాలో సింపుల్ లాంగ్వేజ్‌తో, క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి. పొలిటికల్ స్పీచ్‌లు కూడా ఉంటాయి. మమ్ముట్టి: తెలుగు డైలాగ్స్ అన్నీ మలయాళంలో రాసుకోవడం వల్ల ఈజీ అయింది. బాగా చదువుకుంటున్నా (నవ్వుతూ). ఈజీగా చెప్పేస్తున్నా. విజయ్: అది చాలా పెద్ద ఎఫర్ట్. ఆల్రెడీ మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్లోను రోజుకో గంట ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయడం చిన్న విషయం కాదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెలుగుకు తిరిగి రావడం ఎలా ఉంది? మమ్ముట్టి: చాలా చేంజెస్ కనిపించాయి. ఆయినా ఫుల్‌గా ఇక్కడికి వచ్చినట్టు కాదు. నేను బయటే ఉన్నాను. వచ్చి సినిమా చేసి, వెళ్లిపోతున్నాను. మమ్ముట్టిగారి లుక్ టెస్ట్ జరిగాక దర్శక–నిర్మాతలుగా మీ ఫీలింగ్? విజయ్: మాకు ఎగై్జటింగ్‌గా అనిపించింది. మమ్ముట్టిగారు గాల్లోకి అలా చెయ్యెత్తగానే చాలా ఎగై్టట్ అయ్యాం. మనకి ఇద్దరూ (వైయస్సార్, మమ్ముట్టి) తెలుసు. వైయస్సార్‌గారిని చూశాం. నటుడిగా మమ్ముట్టిగారిని ఎన్నో పాత్రల్లో చూశాం. వైయస్సార్‌గారి పాత్రలో ఆయన్ను చూడటం ఓ స్పెషల్ ఫీలింగ్. మహీ: ఆ ఫీలింగ్‌ని మాటల్లో చెప్పడం కష్టం. వైయస్‌ని పర్సనల్‌గా ఎప్పుడైనా కలిశారా? మమ్ముట్టి: లేదు. మహీగారూ.. ఈ కథ రాసే ముందు మీరు చేసిన రిసెర్చ్ గురించి? మహీ: నేను వైయస్‌గారి ఫ్యామిలీ అందరితో మాట్లాడాను. స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి తొమ్మిది నెలలు పట్టింది. స్పెసిఫిక్‌గా ఈ టైమ్‌లో కథ రాయడం మొదలుపెట్టానని చెప్పను. ఐదారేళ్లుగా బిట్స్ బిట్స్‌గా రాసుకుంటూ వచ్చాను. నాకు ఇన్స్పైరింగ్గా అనిపించినవన్నీ రాశాను. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అన్నింటినీ కలిపి స్క్రిప్ట్‌ని ఓ స్ట్రక్చర్కి తీసుకొచ్చాం. ఫైనల్లీ సినిమా బడ్జెట్ ఎంత అనుకున్నారు? విజయ్: సుమారు 30 కోట్లు అనుకుంటున్నాం. వైయస్ లాంటి గొప్ప లీడర్ సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. – డి.జి. భవాని -
చెప్పులు విప్పితేనే భోజనం
వైవిధ్యం చెప్పులు ఎక్కడ విప్పుతాం? గుడి, మసీదు, ప్రార్థనా మందిరాలు.. కొన్ని సందర్భాల్లో దుస్తులు, నగల దుకాణాల ముందు.. ఇలా అన్నిచోట్లా తిరిగి ఇంటికి చేరుకున్నాక, ఇంటి గుమ్మం ముందు విప్పుతాం. అయితే, భోజనం కోసం హోటల్ లోపలకు వెళ్లడానికి చెప్పులు వదలడం ఎక్కడైనా చూశారా? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇలాంటి హోటల్ మన భాగ్యనగరంలోనే ఉంది. నగరంలోని పెద్దపెద్ద స్టార్ హోటళ్లు, బడా రెస్టారెంట్లలో ఎక్కడా కనిపించని సంప్రదాయం పూటకూళ్ల ఇంటిని తలపించే ఆ చిన్న హోటల్లో కనిపిస్తుంది. పట్టుమని పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పయినా లేని ఆ చిరు హోటల్లోకి అడుగు పెట్టాలంటే, పాదరక్షలను బయటే విడిచిపెట్టక తప్పదు. ఈ నిబంధన కేవలం భోజనానికి మాత్రమే పరిమితం కాదు. అక్కడ టిఫిన్ చేయాలన్నా, స్నాక్స్ తినాలన్నా ఈ నిబంధనను పాటించి తీరాల్సిందే. పాదరక్షల నిషేధాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న ఆ హోటల్.. సుల్తాన్‌బజార్‌లోని కందస్వామి లేన్‌లో ఉన్న ‘జై జలరాం హోటల్’. ఇంటి భోజనాన్ని తలపించే తృప్తికరమైన రుచులను వడ్డించడం ఈ హోటల్ ప్రత్యేకత అని చెబుతారు హోటల్ యజమానులు భావన్ రాజా, హర్ష రాజా దంపతులు. కింద కూర్చునే.. భావన్ది మహారాష్ట్రలోని అమరావతి. తన తాతల కాలంనాటి నుంచి అంటే దాదాపు 150 ఏళ్లుగా అక్కడ హోటల్‌ను నడుపుతున్నారు. భావన్ కొంతకాలం డిజిటల్ స్క్రీన్, ఫ్లెక్సీ, సైన్బోర్డ్, గ్లో యాడ్స్ బిజినెస్ కూడా చేశారు. అది తృప్తికరంగా సాగకపోవడంతో వదిలేశారు. అత్తగారిల్లు హైదరాబాద్‌కు మకాం మార్చారు. సొంత ఊరిలో హోటల్ నడిపిన అనుభవం ఉండటంతో.. కందస్వామి లేన్‌లో రెండేళ్ల క్రితం అద్దె ఇంటిలో హోటల్ ఏర్పాటు చేశారు. ఏడాది కిందటి వరకు అక్కడ హోటల్ ఉందంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఎందుకంటారా..? కనీసం హోటల్ అని తెలిపే బోర్డు లేకపోవడం, అది కూడా మొదటి అంతస్తులో అద్దెకుంటున్న ఇంట్లో ఉండడం. పైగా అక్కడ ఎంచక్కా కస్టమర్లను కింద కూర్చోబెట్టి పంక్తి భోజనంలా వడ్డించేవారు. ఈ తరహా సంప్రదాయం నచ్చిన వాళ్లంతా భోజనం చేయడానికి క్యూ కట్టేవారు. సంప్రదాయుం ముఖ్యం.. ఏడాది కిందట షట్టర్ అద్దెకు తీసుకుని హోటల్‌ను కిందికి మార్చారు. ప్రస్తుతం కుర్చీల్లో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నా, కస్టవుర్లు పాదరక్షలను విడిచి రావాలన్న నిబంధనను మాత్రం వీడలేదు. చెప్పులు విప్పి తినమంటే చాలా మందికి చిరాకే. ఇది నచ్చక.. వచ్చిన క స్టమర్లు వెనుదిరగక మానరు. ఫలితంగా హోటల్ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించే పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు పాదరక్షలతో ప్రవేశంపై నిషేధాన్ని పాటించడం లేదు. కాని భావన్ అలాకాదు. గిరాకీ ఎంత ముఖ్యమో, సంప్రదాయం కూడా అంతే ముఖ్యం అంటారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. తినేటప్పుడు చెప్పులు విప్పాలన్న నియమం కొందరికి నచ్చదు. అలాంటి కస్టమర్లు తినకుండా వెళ్లిపోతుంటారు. కొన్ని రోజులకు ఆలోచించుకుని తిరిగి వస్తుంటారు. సంప్రదాయం అని మాత్రమే కాదు, చెప్పులు విప్పి, కాళ్లు చేతులు కడుక్కుని శుభ్రంగా భోజనం ముందు కూర్చుంటే క్రిమికీటకాలు దరిచేరవు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు’ అని భావన్ అంటున్నారు. - మహి -
30 లక్షలతో ‘ఎంజాయ్’
మహి, సునీతా మార్షియా జంటగా రూపొందిన చిత్రం ‘ఎంజాయ్’. జి.వి.సుబ్రమణ్యం దర్శకుడు. జి.సత్యనారాయణ నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో దర్శక-నిర్మాత మారుతి చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. స్నేహితుల సహకారంతో కేవలం 30 లక్షలతో సినిమాను పూర్తి చేశామని దర్శకుడు చెప్పారు. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పక ఆశీర్వదిస్తారని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘నా ‘ఈ రోజుల్లో’ సినిమా ఎంతమందిని బాగు చేసిందో, అంతమందిని చెడగొట్టింది. ఈ ‘ఎంజాయ్’ బృందం మాత్రం బాగుపడిన వారి జాబితాలోనే ఉండాలి’’ అని మారుతి ఆకాంక్షించారు. దర్శకులు శివనాగేశ్వరరావు, వీరశంకర్, దేవిప్రసాద్ మాట్లాడారు.