
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అంటే నమ్ముతారా? తల్లయినా తన అందాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోందీ బ్యూటీ. 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్ చేసింది. 2006లో నటనారంగంలో అడుగుపెట్టింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా...? తన పేరు వీజే మహి వినోద్.
ఒకప్పుడు హీరోయిన్..
ఎవరైనా సీరియల్స్ నుంచి సినిమాలకు వెళ్తారు. కానీ ఈ నటి జర్నీ మాత్రం అందుకు రివర్స్‌గా ఉంటుంది. 2004లో తపన అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది అపరిచితన్ అనే మలయాళ మూవీ కూడా చేసింది. తర్వాత అవకాశాలే రాకపోవడంతో రెండేళ్లు ఎదురుచూసి సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత 2008లో కన్నడలో ఓ సినిమా చేసి పూర్తిగా బుల్లితెరపైనే సెటిలైంది. రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ 2020 తర్వాత మరే షోలోనూ కనిపించనేలేదు.
ముగ్గురు పిల్లల బాధ్యత తనదే
ఆమె పర్సనల్ విషయానికి వస్తే మహి 2011లో నటుడు జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు సంతానం. అలాగే రాజ్‌వీర్, ఖుషి అనే ఇద్దరు పిల్లలను పెంచి పోషిస్తోంది. వారికి అమ్మానాన్న ఉండటంతో దత్తత తీసుకోలేదు కానీ తరచూ ఆ పిల్లల్ని కలుసుకుంటూ ఉంటుంది. వారి పెంపకం, విద్య.. అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకుంది. తన మంచి మనసుకు ఫిదా అయిన ఫ్యాన్స్ తిరిగి ఆమె సినిమాల్లోకి వస్తే బాగుండని ఆశపడుతున్నారు.
చదవండి: టిల్లు స్క్వేర్: శ్రీసత్యకు అన్యాయం! సిద్ధుతో నటించిన సీన్స్ ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment