మంజరి ఫడ్నీస్.. 'రోక్ సకో టు రోక్ లో(2004)' అనే హిందీ చిత్రంతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇంకోసారి, శుభప్రదం సినిమాల్లో హీరోయిన్‌గా.. శక్తి మూవీలో కీలక పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో కనిపించనేలేదు. తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, హిందీ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఓటీటీ ప్రాజెక్టులతో బిజీ అయింది.
సెకండ్ హీరోయిన్‌గా అడిగారు
తాజాగా ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను మీడియాతో పంచుకుంది. మంజరి మాట్లాడుతూ.. 'జానే తు యా జానే నా(2008) సినిమా తర్వాత హీరోయిన్‌గా చాలా అవకాశాలు వస్తాయనుకున్నాను. కానీ అది జరగలేదు. కొన్ని యాక్షన్ సినిమాలు చేశాను తప్పితే.. అన్నింటిలోనూ సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడిగారు. తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించడానికి నాకు మనసు ఒప్పలేదు. అందుకని మంచి ఛాన్సుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను.
సంతృప్తి చెందలే..
మల్టీస్టారర్ సినిమాల్లో అవకాశాలు వస్తే చేశాను. దీనివల్ల నాకు మంచి జరిగిందేమో కానీ నటిగా నాకంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. 2017లో సినిమాలకు కొంతకాలం పాటు బ్రేక్ ఇద్దామనుకున్నాను. ఇండస్ట్రీని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్నాను. మళ్లీ చదువు కంటిన్యూ చేద్దామనుకున్నాను. అప్పుడు థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసి స్కిల్స్ పెంచుకున్నాను.
ఓటీటీల పుణ్యమా అని..
ఓటీటీల రాకతో నా దశ తిరిగింది. 2019లో బరోత్ హౌస్ అనే సినిమా చేశాను. ఇది నేరుగా ఓటీటీలో(జీ5లో) రిలీజైంది. ఈ ఒక్క సినిమా నా తలరాతనే మార్చేసింది. గతంలో కంటే మెరుగైన, ప్రాధాన్యమున్న పాత్రలు నాకు ఆఫర్ చేశారు. అలా మాసూమ్, మియా బివి ఔర్ మర్డర్, ద ఫ్రీలాన్సర్ అనే వెబ్ సిరీస్‌లు చేశాను' అని చెప్పుకొచ్చింది మంజరి ఫడ్నీస్.
చదవండి: అనుహ్యంగా ఓటీటీలో రిలీజైపోయిన సుధీర్ కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్‌తో
Comments
Please login to add a commentAdd a comment