తెలుగులో ఒకే ఒక్క సినిమా.. హీరోయిన్‌ను గుర్తుపట్టారా? | Antara Mali: Do You Remember This Heroine | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో అన్నీ ఫ్లాప్‌ సినిమాలే.. ఇండస్ట్రీని వదిలేసిన బ్యూటీ!

Published Sat, May 11 2024 6:20 PM | Last Updated on Sun, May 12 2024 12:48 PM

Antara Mali: Do You Remember This Heroine

సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే జనాలే ఎక్కువ. హీరోయిన్లయితే సక్సెస్‌ రేటు లేకపోతే ఎక్కువరోజులు నెట్టుకురాలేరు. హిట్టు అనే ఆక్సిజన్‌ అందితేనే ఫిల్మీదునియాలో వారికంటూ స్థానం ఉంటుంది. పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అంతర మాలి. ఈ రోజు (మే 11న) తన పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన జర్నీని ఓసారి చూసేద్దాం..

ఆయన కూతురే అంతర
బాలీవుడ్‌లోని ఫేమస్‌ ఫోటోగ్రాఫర్‌ జగదీశ్‌ మాలి కూతురే ఆంతర మాలి! 35 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న ఆయన తర్వాత కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. ఒకానొక సమయంలో అంతర తండ్రిని వదిలేయడంతో.. ఆయన ముంబై వీధుల్లో రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించాడని వార్తలు వచ్చాయి. అయితే సమయానికి ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోకపోవడం వల్లే అలా జరిగిందని, తాను ప్రెగ్నెంట్‌గా ఉండటం వల్లే తండ్రిని చూసుకోలేకపోయానని నటి వివరణ ఇచ్చింది.

ఫస్ట్‌ సినిమా బోల్తా
అంతర విషయానికి వస్తే 1998లో ధూండ్తే రేహ్‌ జావోగే మూవీతో తన సినీజర్నీ మొదలైంది. కానీ తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ మరుసటి ఏడాది రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమకథ అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తర్వాత  వర్మ డైరెక్షన్‌లోనే పలు చిత్రాలు చేసింది.

ఎక్కువ ఫ్లాప్స్‌
రోడ్‌, కంపెనీ, డర్నా మర్నా హై, నాచ్‌, మిస్టర్‌ యా మిసెస్‌ వంటి మూవీస్‌లో మెరిసింది. చాలావరకు ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్‌గానే నిలిచాయి. 2009లో జీక్యూ మ్యాగజైన్‌ ఎడిటర్‌ చె కురియన్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత .. అండ్‌ వన్స్‌ ఎగైన్‌ (2010) అనే ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది.

చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement