సీరియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. హిందీలో అయితే టాలెంట్ చూపించిన సీరియల్ యాక్టర్స్ ఎందరో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. హిందీ సీరియల్‌లో నటించిన ఈ బ్యూటీని తొలిసారి బిగ్‌స్క్రీన్‌కు పరిచయం చేసిందే తెలుగు సినిమా!
బాలీవుడ్ నుంచి పిలుపు
ఆమె పేరు మధురిమ తూలి. 2008లో జగపతిబాబు, జేడీ చక్రవర్తిల 'హోమం' సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఏడాది తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లిపోయి వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మధ్యలో ఒకటీరెండు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించింది. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లోనూ పాల్గొంది.
పెళ్లి ఊసే లేదు
ప్రస్తుతం టెహ్రాన్ అనే పెద్ద సినిమాలో నటిస్తోంది. ఇన్నేళ్లలో తిరిగి ఒక్కసారి కూడా తెలుగులో నటించలేదు. మరి టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదా? లేదంటే వచ్చినవాటిని కాదనుకుని బాలీవుడ్‌లోనే సెటిలైపోయిందా? అన్నది ఆమెకే తెలియాలి! 37 ఏళ్ల వయసొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య ఒకరిని ప్రేమించి బ్రేకప్ చెప్పింది. అప్పటినుంచీ ప్రేమ, పెళ్లి ఊసే ఎత్తడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment