విజేతల యాత్ర | Winners Trip Movie Teaser Released By Babu Mohan | Sakshi
Sakshi News home page

విజేతల యాత్ర

Published Mon, Feb 24 2020 5:55 AM | Last Updated on Mon, Feb 24 2020 5:55 AM

Winners Trip Movie Teaser Released By Babu Mohan - Sakshi

సోనా, మహి

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడమే ఒక విజయం. ‘విన్నర్స్‌ ట్రిప్‌’ టీమ్‌ సంతోషం చూస్తుంటే కచ్చితంగా గెలవాలనే తపనతోనే ఈ సినిమా తీశారనిపిస్తోంది. టీజర్‌ చూస్తుంటే యూనిట్‌  కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నమ్ముతున్నా’’ అని నటుడు బాబూమోహన్‌ అన్నారు. మహి, సోనా పాటిల్‌ జంటగా శ్రీను తెలుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విన్నర్స్‌ ట్రిప్‌’. శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్‌ సమర్పణలో ఎస్‌ఎస్‌సి క్రియేషన్స్‌ పతాకంపై  సంపత్‌ శ్రీను, కె. లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బాబూమోహన్‌ విడుదల చేశారు.

సంపత్‌ శ్రీను మాట్లాడుతూ– ‘‘మా సినిమా 30 రోజులు టాకీ, 10రోజులు పాటల చిత్రీకరణంతా గోవాలోనే పూర్తి చేశాం. ఎడిటర్‌ ఈశ్వర్‌ మా చిన్న సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లారు’’ అన్నారు. ‘‘ఒక ఎఫ్‌ఎమ్‌ రేడియో పోటీ విజేతలను ఒక ట్రిప్‌కి తీసుకెళ్లగా అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుండి ఎంతమంది బయటపడ్డారు? అనేది చిత్రకథాంశం’’ అన్నారు తెలుగు శ్రీను. మహి, సోనా పాటిల్, ప్రసన్నకుమార్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement