
30 లక్షలతో ‘ఎంజాయ్’
మహి, సునీతా మార్షియా జంటగా రూపొందిన చిత్రం ‘ఎంజాయ్’. జి.వి.సుబ్రమణ్యం దర్శకుడు. జి.సత్యనారాయణ నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో దర్శక-నిర్మాత మారుతి చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. స్నేహితుల సహకారంతో కేవలం 30 లక్షలతో సినిమాను పూర్తి చేశామని దర్శకుడు చెప్పారు. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పక ఆశీర్వదిస్తారని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘నా ‘ఈ రోజుల్లో’ సినిమా ఎంతమందిని బాగు చేసిందో, అంతమందిని చెడగొట్టింది. ఈ ‘ఎంజాయ్’ బృందం మాత్రం బాగుపడిన వారి జాబితాలోనే ఉండాలి’’ అని మారుతి ఆకాంక్షించారు. దర్శకులు శివనాగేశ్వరరావు, వీరశంకర్, దేవిప్రసాద్ మాట్లాడారు.