సాక్షి, న్యూఢిల్లీ: ప‌్రాణాంతకమైన కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడ్డ పేషెంట్లకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు గర్హనీయమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడులకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టం చేసిందని పేర్కొన్నారు. (ఆత్మీయుడిని కోల్పోయిన బాధ ఇప్పటికీ)
2007లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కేవీపీ రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ తర్వాత హర్యానా, తదితర రాష్ట్రాలు సైతం అదే తరహా చట్టాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ఆపత్కాల సమయంలో మనందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేయాలని పిలుపునిచ్చారు. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్)
Comments
Please login to add a commentAdd a comment