రాయి పని చేస్తున్న ముస్లింలు
జి.సిగడాం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తమకు మేలు జరిగిందని పలువురు ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. జి.సిగడాం మండల పరిధిలో మెట్టవలస– పాలఖండ్యాం జంక్షన్‌లో సుమారు 40 ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయి. వైఎస్సార్ సీఎం కాకముందు ముస్లిం సంక్షేమాన్ని ఏ నాయకుడూ పట్టించుకోలేదు. ఫలితంగా సంక్షేమ పథకాలకు దూరమయ్యేవారు. ఈ తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గద్దెనెక్కిన తర్వాత ముస్లింకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. దీంతో అనేక మందికి ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలు దక్కాయని ముస్లింలు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న హయాంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఇద్దరికి ఉపాధ్యాయ కొలువులు దక్కాయని గర్వంగా చెప్పుకుంటున్నారు. మహానేత పాలనను మరువలేమంటూ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమకు మరోసారి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్లతో మేలు
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వేషన్ల కారణంగా రెండుసార్లు మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యునిగా పదవులు కేటాయించారు. వీటితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందించారు. రాజశేఖరరెడ్డి దయవల్లే మాకు సంక్షేమ పథకాలు అందాయి.
– బడాన్, మెట్టవలస, జి.సిగడాం
రాజన్న రుణం తీర్చుకోలేనిది
పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న సమయంలో చదువుకున్న యువతీ, యువకులకు నాలుగుశాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో ముస్లింలకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ఇదంతా రాజశేఖరరెడ్డి ప్రకటించిన రిజర్వేషన్ల ఫలితమే. మహానేత రుణం తీర్చుకునేందుకు అందరూ కృషి చేస్తున్నాం.
– ఫాతీమా బేగం, ఉపాధ్యాయురాలు
Comments
Please login to add a commentAdd a comment