మైనారిటీలకు న్యాయం ఆయన హయాంలోనే | YSRCP Leaders Remember YSR Government | Sakshi
Sakshi News home page

Aug 15 2018 10:38 PM | Updated on Aug 25 2018 12:06 PM

YSRCP Leaders Remember YSR Government - Sakshi

మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, రాయచోటి : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోనే మైనారిటీలకు అన్నివిధాల న్యాయం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం రాయచోటి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు అకేపాటి అమరనాథరెడ్డిలు పాల్గొన్నారు. మైనారిటీలకు అన్నివిధాల వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా మైనారిటీలకు మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకొస్తున్నారని.. ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్సార్‌ సీపీ నేతలు కోరారు.

ఇంటింటికి నవరత్నాల కార్యక్రమంతో నిరంతరం ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.మహానేత వైఎస్సార్‌ వల్లే రాయచోటికి త్రాగునీరు లభించిందని, పట్టణ ప్రజలకు ఉచితంగా శుద్ధినీరు అందించేందుకు శ్రీకారం చుడుతున్నామని నాయకులు వివరించారు. చంద్రబాబు హయాంలో రాయచోటికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, ఎంపీ నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని వారు తెలిపారు. ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు తెలిపారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement