
ఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి సోమవారం నిర్వహించిన లోక్‌సభ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని కోరాము. దీనికి లోక్‌సభ స్పీకర్ సానుకూలంగా స్పందించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలందరం కేంద్రమంత్రులను కలిశాం. అలానే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులన్నీ కేంద్రమే భరించాలి.. సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరాం.పోలవరం, విశాఖ ఉక్కు అంశాలపై పార్లమెంట్‌లో పోరాడుతాం’’ అని తెలిపారు మిథున్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment