వైఎస్సార్‌సీపీలో చేరిన యువకులతో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
సాక్షి, సంగం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బొల్లినేని కృష్ణయ్యనాయుడే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసినా గెలుపొందేది తానేనని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సంగం మండలం దువ్వూరుకు చెందిన నాయకుడు సూరి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ నాయకులకు ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ నాయకులు పెట్టే ప్రలోభాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులు ఏ ఒక్కరూ లొంగబోరన్నారు.
ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటి చేస్తున్న బోల్లినేని కృష్ణయ్యనాయుడు ఆదివారం చేజర్ల మండలంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బొల్లినేని కృష్ణయ్య ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలను అరికట్టాలని తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వానికి ముందు తెలియజేయాలన్నారు. అంతేగానీ గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానంటే కృష్ణయ్య కాదు కదా సాక్షాత్తు చంద్రబాబు పోటీ చేసినా తన చేతిలో ఓటమి తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టడంతో పేదలు పడుతున్న కష్టాలను గుర్తించి ఆరోగ్య శ్రీ తదితర గొప్ప పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాదయాత్ర అనే పదానికి అర్థమే వైఎస్ కుటుంబమని, ఇది రాష్ట ప్రజలందరికీ తెలుసునన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబంలో నుంచి వచ్చిన రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 2019లో ఓటు అనే ఆయుధంతో ఆశీర్వదించాలన్నారు.
2019లో రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారు కోరిన పనిని ఒక్క రోజులో పూర్తి చేసే విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో నాయకులు షేక్ మహబూబ్‌బాష, కరీముల్లా, నాయబ్‌బాషా, అబ్దుల్ జలీల్, రఫీ అహ్మద్, షాహుల్, హమీద్, అబిద్‌బాషా, జమీర్, అలీంబాషా, ఖాజారసూల్, సిరాజ్, ఇర్ఫాన్, వహాబ్‌బాషా, ఉస్మాన్, జలీల్, జన్నత్, చోటా, బాషా, గౌస్‌మొహిద్దీన్, షఫీ, సమీవుల్లా, గౌస్‌బాషా, జమీర్, నిజాం, అక్బర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, రేబాల సురేంద్రరెడ్డి, వేల్పుల కోటేశ్వరరావు, భువన రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment