మాట్లాడుతున్న బలరామ్ నాయక్
పర్ణశాల: ఏజెన్సీలో గిరిజనులు పోడుగొట్టి సాగు చేస్తున్న పదివేల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుం దని మాజీ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. దుమ్ముగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ఎన్నికల్లో ప్రధాన హామీలైన దళితులకు మూడేకరాల భూమి, కేజీ టు పీజీ విద్యాతో పాటు మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ వంటివి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదాయం వచ్చే పథకాలైన మిషన్ భగీరథ, కాకతీయ వంటి వాటికే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతా అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పడం ఖాయ మని అన్నారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. సమావేశంలో డివిజన్ ఇన్‌చార్జ్ నల్లపు దుర్గాప్రసాద్, కృష్టార్టునరావు, లంక శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామారావు, ప్రసాద్, శ్రీలక్ష్మి, వేమనరెడ్డి, అప్పలరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment