సోమశిల, న్యూస్‌లైన్ : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగమని, భవిష్యత్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తప్ప మరెవరితో ఇటువంటి పాలన రాబోదని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి చేపట్టిన పాదయాత్ర అనంతసాగరం మండలంలో గుడిగుంట, చిలకలమర్రి, మంగుపల్లి, కామిరెడ్డిపాడు పంచాయతీల్లో జరుగుతుండగా ఎంపీ మేకపాటి పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తొమ్మిదేళ్లు చంద్రబాబు పాలనలో సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఎందుకు బతుకుతున్నామా అనే విధంగా బాధలు పడ్డారన్నారు.
రాజశేఖరరెడ్డి తన హాయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ అందించారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 108, ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జనమ్మ ప్రసాదించారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివారంటే వైఎస్సార్ పుణ్యమేనన్నారు. చంద్రబాబు హయాంలో విద్యార్థులు ఉన్నతచదవులు చదవలేక నిరుద్యోగులుగా
మారారన్నారు. మహానేత బతికి ఉంటే నేడు రాష్ట్రం, దేశంలో ఇలాంటి క్లిష్టపరిస్థితులు వచ్చేవి కావన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విభజన ప్రక్రియ చేపడుతున్నారన్నారు. కానీ ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. విభజన కుట్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు.
సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. కేంద్రంలో వైఎస్సార్‌సీపీ చక్రం తిప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేములు సుబ్బారెడ్డి, నాయకులు అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, మందా రామచంద్రారెడ్డి, యర్రమళ్ల శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సోమశిలలో ఎంపీ మేకపాటి భోగి వేడుకలు
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం సోమశిలలో భోగి పండగ వేడుకలు జరుపుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమశిల అతిథి గృహంలో బస చేశారు. తెల్లవారుజామున భోగి పండగను స్థానికులతో కలిసి జరుపుకున్నారు. సంప్రదాయాలకు భారతదేశం ప్రతీక అన్నారు. దేశ సంప్రదాయాలను ఇతర దేశాలు సైతం ఇష్టపడుతున్నాయన్నారు. మేకపాటి గౌతంరెడ్డి చిలకలమర్రి సమీపంలో పాదయాత్ర క్యాంపు వద్ద మంగళవారం భోగి పర్వదిన వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా మండలంలోని సోమవారం రాత్రి చిలకలమర్రికి చేరుకున్నారు.
వైఎస్ జగన్‌తోనే సువర్ణయుగం
Published Thu, Jan 16 2014 4:11 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement