వైఎస్సార్‌సీప్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
దగదర్తి (బిట్రగుంట), న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీప్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. దగదర్తి మండలం తడకలూరు, చౌటపుత్తేడు, ఊచగుంటపాళెంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు హాజరైన ఎంపీ మేకపాటి మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎక్కువ స్థానాలు సాధించి చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలు సక్రమంగా అమలవ్వాలంటే జగన్ సీఎం కావాల్సిందేనన్నారు. ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ, కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జనం జగన్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారానికి
కృషి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కావలి కాలువ ద్వారా సాగునీరు సక్రమంగా అందక రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి అన్నారు. సాగునీటి సమస్య కారణంగా రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానమైన కావలి కాలువతో పాటు ఉపకాలువలు ఆధునికీకరణకు నోచుకోకపోవడం, కనీసం పూడిక తీయకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. ్రఏటా 40 శాతానికిపైగా పంట నష్టపోవడంతో పాటు నానా కష్టాలు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతుల కష్టాలకు తెరపడుతుందని భరోసా ఇచ్చారు.
వందలాది మంది పార్టీలో చేరిక
దగదర్తి మండలంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. తడకలూరుకు చెందిన శరత్, హరిబాబు, చౌటపుత్తేడుకు చెందిన రవి, రమణయ్య, ఊచగుంటపాళేనికి చెందిన వరుణ్, శూరయ్య ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. వీరికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గోగుల వెంకయ్య యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బీద రమేష్, నాయకులు వివేక్ తదితరులు పాల్గొన్నారు.