సాక్షి, నెల్లూరు: ఈ నెల 7న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్ రుణం తీర్చుకోవాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మహానేత వైఎస్సార్ అహర్నిశలు కృషి చేశారన్నారు.
వనంతోపు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత శ్రీనివాసరావు (ఆర్‌ఎస్సార్) వెయ్యి మంది అనుచరులతో బుధవారం పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో స్థానిక మేకపాటి అతిథిగృహంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, మేయర్ అభ్యర్థి అబ్దుల్‌అజీజ్ పాల్గొన్న కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్రలతోనే జగన్ ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు.
పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని అన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన అవసరముందన్నారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే రాష్ర్ట అభివృద్ధి చెందుతుందన్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైఎస్సార్ వల్లే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ నేత ఆర్ శ్రీనివాసరావు, ఆయన అనుచరులు భరత్, శేషయ్య, చెన్నమ్మ, చౌడమ్మ, మాతాశేఖర్, శ్రీని వాసులు, మురుగ, నాగేంద్ర, మల్లి, ఉష మ్మ, శంకరమ్మ, అనీల్, మస్తాన్, పాపిరెడ్డి, వేణుతో పాటు వెయ్యి మంది పార్టీలో చే రారు. ఆర్‌ఎస్సార్ ఆధ్వర్యంలో 300 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్ రుణం తీర్చుకుందాం
Published Thu, May 1 2014 3:11 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement