ఆత్మకూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ అండదండలతో రాజకీయనేతలుగా ఎదిగిన ఇక్కడి నాయకులు ఆయన కుటుంబంపైనే అవాకులు, చెవాకులు పేలుతున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పేరోజు దగ్గరలోనే ఉందని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి పాదయాత్ర బుధవారం ఆత్మకూరు మండలం ఆరవీడు, వెన్నవాడ గ్రామాల్లో సాగింది. ఆరవీడు నుంచి ఉత్తరకాలువ ఒడ్డున పాదయాత్రగా వెన్నవాడ చేరుకున్నా రు. వెన్నవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ మేకపాటి మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ సీఎం కావడమే ఏకైక మార్గమన్నారు. జగన్ ఆదేశాల మేరకు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారన్నారు. గౌతమ్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం సమగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు.
రైతుల కళ్లలో ఆనందం నింపితేనే సంతృప్తి: మేకపాటి గౌతమ్‌రెడ్డి
రైతుల కళ్లలో ఆనందం నింపితేనే సం తృప్తి లభిస్తుందని వైఎస్సార్ సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం ఆరవీడు, వెన్నవాడ గ్రామాల్లో బుధవారం గౌతమ్‌రెడ్డి ఎంపీ రాజమోహన్‌రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఆరవీడులో మంగళవారం రాత్రి బస చేశారు. బుధవారం అక్కడి నుంచి ఉత్తర కాలువ మీదుగా వెన్నవాడ చేరుకున్నారు. ఉత్తరకాలువను పరిశీలించారు. కాలువలో నీరు లేకపోవడం, సమీపంలో రైతులు పొలాల్లో పంటలను కాపాడుకునేం దుకు పడరాని పాట్లు పడుతుండటం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు విలపించే రాష్ట్రంలో అశాంతి వాతావరణం ఉంటుందన్నారు. రైతు ఆనందంగా ఉంటేనే లోకమంతా నిజమైన పండగన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తొలి ప్రాధాన్యం సాగునీటికే అన్నారు. ఏఎస్‌పేట, ఆత్మకూరు మం డలాల్లో తాను పాదయాత్ర చేశానని, ఆయా మండలాల్లో ఎక్కువగా తాగునీరు, సాగునీటికే ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించానన్నారు. జగన్ సీఎం కాగానే ఉత్తరకాలువ అభివృద్ధికి ఎక్కువ నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ‘నేను మీవాడినే. ఒక్కసారి అవకాశం ఇవ్వం డి. అభివృద్ధి చేసి చూపుతా’నంటూ ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌ను సీఎం చేయడమే మార్గమన్నారు. మహా నేత ఆశయాలు నెరవేర్చేది ఒక్క జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రసంగంలో రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించినప్పుడల్లా ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి.
కార్యక్రమంలో కావలి, గూడూరు, సూళ్లూరుపేట సమన్వయకర్తలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సం జీవయ్య, సీఈసీ సభ్యులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి,పాపకన్ను రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, ఆత్మకూరు సిండికేట్ ఫార్మర్స్ కో- ఆపరేటీవ్ సొసైటీ డెరైక్టర్ దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, రామస్వామిపల్లి సర్పంచ్ సానా వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు సూరా భాస్కర్‌రెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, ఆనందరెడ్డి, గుండాల మునిరెడ్డి, తుమ్మల కొండారెడ్డి, చిన్నపురెడ్డి, ఫర్వీన్, సుబ్బరత్నమ్మ, గడ్డం శ్రీనివాసులురెడ్డి,పులిమి జగన్మోహన్‌రెడ్డి, వాసిపల్లి లక్ష్మీరెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, కొం డ్రెడ్డి రమణారెడ్డి, కంజుల ప్రసాద్‌రెడ్డి, చిలకా సుబ్బరామిరెడ్డి, ఓబుల్‌రెడ్డి, నా గులపాటి ప్రతాప్‌రెడ్డి, బత్తిన హరనాథ్‌రెడ్డి, ఇందూరుశేషారెడ్డి, స్థానిక నేతలు సూర్యనారాయణ,బలరామిరెడ్డి, విజయనరసింహారెడ్డి పాల్గొన్నారు.
అవాకులు పేలితే బుద్ధిచెబుతాం
Published Thu, Dec 26 2013 3:47 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement