సాక్షి, నెల్లూరు : మహాప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన మహానేత డాక్టర్ వైఎస్సార్, వాటిని తొలగించేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టి వారి మనస్సుల్లో దేవుడిలా కొలువయ్యారని నెల్లూరు ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని నాగేంద్రనగర్, లక్ష్మీపురం, వీవర్స్‌కాలనీ, రంగనాయకులపేట, ఇసుకడొంక, గోపవరం ప్రాంతాల్లో ఆదివారం ఆయన సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహానేత చేపట్టిన పథకాలకు ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. అంతటితో ఆగక వైఎస్ కుటుంబాన్ని అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి ఇబ్బంది పెట్టిందన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తండ్రి ఆశయ సాధన సాధ్యం కాదని భావించిన జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. ఆయన సీఎం అయితేనే వైఎస్సార్ పథకాలన్నీ తిరిగి అమలవుతాయన్నారు.
అందుకోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికారం కోసం కూతురినిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆయన ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి పాటుపడ్డాడన్నారు. ముస్లింలందరూ వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తారని చెప్పారు. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ రాజన్న కాలం నుంచి స్వర్ణయుగం వస్తుందన్నారు. ఐదేళ్లుగా ఆయన నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టాలను దగ్గర నుంచి చూశారన్నారు.
ప్రజలందరూ ఫ్యాను గుర్తుకు ఓట్లేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమాల్లో 7వ డివిజన్‌లో పెళ్లూరు శ్రీనివాసులు, బాలరాజు, డీపీఎల్ నారాయణ, తులసీరామ్, నాగభూషణం, రాములు యాదవ్, సుధాకర్, ముక్కాల ద్వారకానాథ్, ఎడిచర్ల శివకుమార్, 52వ డివిజన్‌లో పఠాన్ ఫయాజ్‌ఖాన్, ఎస్‌కె. తాజుద్దీన్, అస్రఫ్‌భాయ్, ముప్పసాని శ్రీనివాసులు, ఇతియాజ్, పిగిలం సుధీర్, జలీల్, షాబుద్దీన్, షాన్‌వాజ్, ఆసిఫ్ అహ్మద్, సలీమ్ అహ్మద్, మునీస్ సిద్దిక్, వెంకటరమణ, అంజాహుస్సేన్, బాషా, ఖలీల్ అహ్మద్, ఉదయ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనస్సుల్లో కొలువైన వైఎస్సార్
Published Mon, Apr 28 2014 3:10 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement