-ఎంపీ మేకపాటి
కావలి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలను తెలుగు ప్రజలు క్షమించరని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 14వ వార్డు ముసునూరులో గురువారం గడపగడపకు వైఎస్సార్‌సీపీలో భాగంగా ఆ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన జనదీవెన కార్యక్రమానికి ఎంపీ మేకపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 40 సంవత్సరాల యువకుడైన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గంగా రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తెచ్చాయన్నారు.
తెలంగాణలో వైఎస్సార్‌సీపీని దెబ్బకొట్టేం దుకు వ్యూహాన్ని పన్నాయని తెలిపారు. సీమాంధ్రలో ఓ వ్యక్తిని సమైక్య చాంపియన్‌గా చూపించి అతని చేత రాజకీయ పార్టీని పెట్టిం చి ఇక్కడ ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయన్నారు. సమైక్యవాద ప్రజలు ఈ విషయాల న్నింటినీ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన అంశం ఫిబ్రవరి 21కి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడుతామని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు చెప్పిన మాటలనుబట్టి చూస్తుంటే ఆ పార్టీకి కూడా ప్రస్తుతం జరుగుతున్న రాష్ర్ట విభజన అనుకూలంగా లేదన్నారు. రానున్న ఎన్నికలు సమైక్యాంధ్రలోనే జరుగుతాయన్నారు.
రాష్ట్రంలో రానున్నది వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనన్నారు. కేంద్రంలో కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన వ్యక్తులే ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీకి 30 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009లో జరిగే ఎన్నికల్లో తాను నెల్లూ రు ఎంపీగా ఎన్నికయ్యానన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రజలను దురదృష్టం వెంటాడి మహానేత వైఎస్సార్ మరణించారన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో పాలన అస్తవ్యసంగా మారిందన్నారు.
జగన్ సమైక్యశంఖారావాన్ని
విజయవంతం చేయండి
జిల్లాలో శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న సమైక్యశంఖారావాన్ని జయప్రదం చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. నాయుడుపేటలో ప్రారంభమై రెండు రోజుల పాటు జిల్లాలో జరగనున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సమైక్యవాదులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.
కాంగ్రెస్, టీడీపీని ప్రజలు క్షమించరు
Published Fri, Jan 31 2014 3:23 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement