Prathap kumar reddy
-
బీద సోదరుల గ్రామంలో టీడీపీకి భారీ షాక్
సాక్షి, కావలి (నెల్లూరు): రాష్ట్ర రాజధాని నిర్మాణ కమిటీలో సభ్యుడంటూ పోలీసుల పైలెట్ వాహనాన్ని తన వెంట తిప్పుకునే బీద మస్తాన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర స్వగ్రామమైన అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పంచాయతీలోని చంద్రబాబునగర్‌కు చెందిన 50 మత్స్యకార కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఇస్కపల్లిలో పార్టీ సీనియర్ నాయకుడు బీద రమేష్ బాబు యాదవ్ నివాసం వద్ద శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రతి ఒక్కరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మత్స్యకారులు మాట్లాడుతూ మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం మాటలతోనే మభ్యపెట్టి కాలం గడిపారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల కోసం మంచి పథకాలను ప్రకటించారని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని తమ గ్రామానికి రానీయకుండా అడ్డుకోవడం తమల్ని సమాజంలో వేలెత్తి చూపించేలా చేసిందన్నారు. మా గ్రామంలో ఎమ్మెల్యేనే రానీయమంటే, అందుకు ప్రతికారంగా ఇతర గ్రామాల ప్రజలు, ఇతర పట్టణాల ప్రజలు మా గ్రామానికి చెందిన వారిని రానీయమంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచిస్తేనే బాధగా ఉందన్నారు. కొందరిని టీడీపీ నాయకులు పక్కదోవ పట్టించి మా గ్రామానికి ఇలాంటి చెడ్డ పేరు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తు తరాలకు, గ్రామానికి మంచిది కాదని తామే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కూడా కృషి చేస్తామన్నారు. వెనుకబడి ఉన్న మత్స్యకారులను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దండా కృష్ణారెడ్డి, మన్నెమాల సుకుమార్‌రెడ్డి, నీలం సాయి కుమార్ పాల్గొన్నారు. -
'టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు'
నెల్లూరు: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, పాశం సునీల్ కుమార్ ఖండించారు. టీడీపీ నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ప్రతాప్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో పోలీసులు భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బంద్ సంపూర్ణం
కావలి: కావలి నియోజకవర్గంలో నెల కొన్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసుల సాయంతో ప్రభుత్వం భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన పట్టణ బంద్ శనివారం విజయవంతమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టణానికి చేరుకుని నిరసన ర్యాలీని నిర్వహించాయి. పట్టణంలో దుకాణాలు, విద్యాసంస్థలు, స్కూళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పలుప్రభుత్వ కార్యాలయాలను వైఎస్సార్సీపీ నాయకులు మూయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి బ్రిడ్జిసెంటర్‌లో రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోను అడ్డుకునేందుకు కావలి డీఎస్పీ మోహన్‌రావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రాస్తారాకో చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండుగంటల సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున తోపులాట జరిగింది. నేతలంతా అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యాదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శిలు గంధం ప్రసన్నాంజనేయులు, అళహరి చిట్టిబాబు, బోగోలు మండల కన్వీనర్ తూపిరి పెంచలయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లురెడ్డి, జనిగర్ల మహేంద్రయాదవ్, కుందుర్తి కామయ్య, యల్లంటి ప్రభాకర్, వేగూరి చిన్నపుల్లయ్య, గుడ్లూరు మాల్యాద్రి, నున్నావెంకట్రావు, కలికి ప్రభాకర్‌రెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, చిమ్మిలి అంకబాబు, పుదూరు శ్రీనివాసులు, నాగేశ్వరమ్మ, ఉస్మాన్షరీప్, కరేటి దైవాదీనం తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే రామిరెడ్డి దీక్ష భగ్నం
కావలి: నియోజకవర్గ ప్రజలు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసుల సాయంతో ప్రభుత్వం భగ్నం చేసింది. శుక్రవారం రాత్రి స్థానిక ఏరియా వైద్యశాల సెంటర్లోని దీక్షా శిబిరంపైకి కావలి డీఎస్పీ మోహన్‌రావు ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు సుమారు 50 మందికిపైగా ప్రత్యేక పోలీసులు బలగాలు దూసుకొచ్చాయి. పోలీసుల చర్యపై తీవ్రస్థాయిలో వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాలు, రైతులు, మహిళలు ప్రతిఘటించినప్పటికీ పోలీసులు తమపనిని చేసుకుని పోయి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని చికిత్స కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని స్థానిక ఏరియా వైద్యశాల వైద్యులు ప్రభుత్వానికి పంపిన హెల్త్‌బులిటెన్‌ను ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఈదీక్ష భగ్నంను చేశారు. దీనిపై ఆగ్రహించిన వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు, రైతులు, మహిళా, ప్రజా సంఘాలు స్థానిక ఏరియా బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, నాయకులు డేగా రాము, కామరాజు, కుందుర్తి కామయ్య, పాలడుగు వెంకటేశ్వరావు, అళహరి చిట్టిబాబు, చింతం బాబుల్‌రెడ్డి, వాసు, సూరిమదన్మోహన్రెడ్డి, మందాశ్రీనివాసులు, పేరం వెంకటేశ్వర్లు, విన్సెంట్, షాహుల్ హమీద్, సీపీఎం డివిజన్ కార్యదర్శి మాల్యాద్రి రాస్తారోకోలో పాల్గొన్నారు. ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేడు బంద్ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీక్షను భగ్నం చేసినందుకు నిరసిస్తూ శనివారం కావలి బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. రామిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్ దీక్ష భగ్నం చేసి వైద్యశాలకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని తరలించిన విషయాన్ని తెలుసుకున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ కావలి ఏరియా వైద్యశాలకు వచ్చి, ఎమ్మెల్యే రామిరెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు. పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేయడం సరికాదన్నారు. -
భగీరథుడి పోరుబాట
కావలి : కావలి కాలువ కింద సాగయ్యే ప్రతి ఎకరాకు సాగునీరు.. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చడమే లక్ష్యంగా.. ప్రభుత్వం మెడలు వంచి కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టాలని భగీరథుడిలా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోరుబాటకు సిద్ధమయ్యారు. గత నాలుగేళ్లుగా సాగునీరందక రైతుల పంటలు ఎండుతుంటే, తాగునీరందక ప్రజల గొంతెండుతుంది. ప్రస్తుత సీజన్లో కూడా అదే పరిస్థితి తలెత్తడంతో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అలుపెరగని ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు కలెక్టర్ జానకిని ఒప్పించి ప్రస్తుతం సాగులో ఉండి పంట చేతికందే దశలో ఉన్న పొలాలకు సాగునీరు రప్పించి భగీరథుడయ్యారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. కావలి కాలువ ఆధునికీకరణ, సంగం బ్యారేజీ వద్ద కావలి కాలువకు నీరు విడుదల చేసేందుకు ప్రత్యేక హెడ్‌రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులు చేయడంలో గత, ప్రస్తుత పాలకులు మీనమేషాలు వేస్తుండటంతో రాబోయే వ్యవసాయ సీజన్ నాటికి వీటి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వంపై పోరాటానికి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు చేపట్టనున్న ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా రైతులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. సోమశిలో నీరున్నా..నిష్ర్పయోజనం నియోజకవర్గానికి ప్రధాన నీటి వనరుగా కావలి కాలువ ఉంది. సోమశిల ప్రాజెక్టులో నీరు ఉన్నా, కావలి కాలువ ఆయకట్టు రైతులు ప్రతి సీజన్లో సాగునీటి కష్టాలు పడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా 550 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. కాలువ కింద పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా కాలువ ఆధునికీకరణ జరగకపోవడంతో ఏటా సీజన్లో ఈ సమస్య తలెత్తుతోంది. సంగం బ్యారేజీ ఆధునికీకరణకు నోచుకోకపోవడంంతో బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో ఇసుక బస్తాలు వేస్తే తప్ప కనీసం 400 క్యూసెక్కుల నీరు పారడం లేదు. ప్రతి సీజన్లో బ్యారేజీ వద్ద ఇసుక బస్తాల ఏర్పాటుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా ఫలితం లేకుండా పోతుంది. ఈ ఏడు సోమశిలలో పుష్కలంగా నీరున్నా.. కేవలం సంగం బ్యారేజీ, కావలి కాలువ ఆధునికీకరణ జరగకపోవడం వల్లే ముందుగా ఐఏబీలో నిర్దేశించి మేరకు కూడా సాగునీటిని విడుదల చేయలేకపోయారు. ఒక్క చెరువుకు రాని నీరు కావలి కాలువ కింద నియోజకవర్గంలోని కావలి పట్టణం, రూరల్, దగదర్తి, బోగోలు మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం ఉంది. ఆయకట్టు కింద ఆయా ప్రాంతాల్లో 55 చెరువులు వరకు ఉన్నాయి. ఈ సీజన్లో జరిగిన ఐఏబీ సమావేశంలో కావలి కాలువ కింద సుమారు 75 వేల ఎకరాలకు 55 చెరువుల ద్వారా సాగు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక్క చెరువుకు నీటిని విడుదల చేయలేదు. కాలువ కింద కనీసం 29 వేల ఎకరాలకు కూడా సాగునీటిని అందివ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు ఎంతో సాగునీటి ఇబ్బందులను పడాల్సి వచ్చింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రైతాంగం పడుతున్న సాగునీటి సమస్యను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఈ సమస్యను తీర్చాలని రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారుల చుట్టూ ఎన్నోసార్లు ప్రదక్షణలు చేశారు. అధికారులను ఒప్పించి కొన్ని ప్రాంతాలకు సాగునీటిని పారించారు. దీక్షకు సంపూర్ణ మద్దతు : సాగునీరు, తాగునీటి కోసం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. రైతాంగం కోసం ఆయన నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలి. - శివారెడ్డి, రైతు, గౌరవరం రైతులకు అండగా రామిరెడ్డి దీక్ష : రైతులకు అండగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిరాహార దీక్షను చేస్తున్నారు. ఆయనకు అండగా దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. రైతుల కోసం పోరాడుతున్న నేత ఎమ్మెల్యే ఒక్కరే. - వై. నరసయ్య, రైతు మా పక్షాన ఎమ్మెల్యే దీక్ష : మా పక్షాన కావలి ఎమ్మెల్యే దీక్ష చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంత వరకు మా రైతుల సమస్య పరిష్కారానికి ఏ నాయకుడు, ఎమ్మెల్యేలు పోరాటానికి దిగలేదు. రైతులందరూ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే దీక్షకు మద్దతు తెలపాలి. - పీ మాల్యాద్రి, రైతు -
కేసే లేకుండా అరెస్ట్ ఎలా?
నెల్లూరు(క్రైమ్): ఈ నెల 13న జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎలాగైనా గెలుపొంది అధికారం దక్కించుకోవాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్ లంటూ అధికార పార్టీ నేతలు దుష్ర్పచారానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నకిలీ మద్యం కేసులో అరెస్ట్‌కు రంగం సిద్ధం అంటూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు బుధవారం కథనాలు ప్రసారం చేసి గందరగోళానికి తెరలేపాయి. అయితే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై కేసే నమోదు చేయలేదని, ఇక అరెస్ట్ ఎలా చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తుండటం విశేషం. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో అధికార పార్టీ నేతలు కావలి నియోజకవర్గంలోని పలువురు జెడ్పీటీసీలను ప్రలోభపెట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీన్ని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఐక్యంగా తిప్పికొట్టారు. టీడీపీ నేతలు దిగజారి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను లరెస్ట్ చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతల కుట్ర: జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారు. మా పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించి లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి సిగ్గుచేటు: ఎమ్మెల్యేల అరెస్ట్‌కు రంగం సిద్ధమంటూ అధికార పార్టీ నేతలు, బాకా పత్రికలు ప్రచా రం చేయడం సిగ్గుచే టు. అధికార పార్టీ నేతల తీరు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టుగా ఉంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. అలాంటప్పుడు అరెస్ట్‌కు ఆ స్కారమే లేదు. అరెస్ట్‌ల పేరుతో భయభ్రాంతులను సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారు. అలాంటి కలలు నెరవేరవు. మేరిగ మురళీధర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఎంపీ మేకపాటికి రామిరెడ్డి అభినందన
కావలి, న్యూస్‌లైన్: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నెల్లూరులోని మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి అభినందలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలిసి చర్చించారు. జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కూడా కలిశారు. ఈ సందర్భంగా వారందరు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెంట ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేడా అశోక్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు డేగా రాము, ప్రళయకావేరి మల్లికార్జున ఉన్నారు. -
కాంగ్రెస్, టీడీపీని ప్రజలు క్షమించరు
-ఎంపీ మేకపాటి కావలి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలను తెలుగు ప్రజలు క్షమించరని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 14వ వార్డు ముసునూరులో గురువారం గడపగడపకు వైఎస్సార్సీపీలో భాగంగా ఆ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన జనదీవెన కార్యక్రమానికి ఎంపీ మేకపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 40 సంవత్సరాల యువకుడైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గంగా రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తెచ్చాయన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టేం దుకు వ్యూహాన్ని పన్నాయని తెలిపారు. సీమాంధ్రలో ఓ వ్యక్తిని సమైక్య చాంపియన్‌గా చూపించి అతని చేత రాజకీయ పార్టీని పెట్టిం చి ఇక్కడ ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయన్నారు. సమైక్యవాద ప్రజలు ఈ విషయాల న్నింటినీ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన అంశం ఫిబ్రవరి 21కి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడుతామని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు చెప్పిన మాటలనుబట్టి చూస్తుంటే ఆ పార్టీకి కూడా ప్రస్తుతం జరుగుతున్న రాష్ర్ట విభజన అనుకూలంగా లేదన్నారు. రానున్న ఎన్నికలు సమైక్యాంధ్రలోనే జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రానున్నది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనన్నారు. కేంద్రంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన వ్యక్తులే ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీకి 30 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009లో జరిగే ఎన్నికల్లో తాను నెల్లూ రు ఎంపీగా ఎన్నికయ్యానన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రజలను దురదృష్టం వెంటాడి మహానేత వైఎస్సార్ మరణించారన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో పాలన అస్తవ్యసంగా మారిందన్నారు. జగన్ సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయండి జిల్లాలో శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమైక్యశంఖారావాన్ని జయప్రదం చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. నాయుడుపేటలో ప్రారంభమై రెండు రోజుల పాటు జిల్లాలో జరగనున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. -
నేడు పంటలను పరిశీలించనున్న ఎంపీ మేకపాటి
కావలి, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం బోగోలు, కావలి, దగదర్తి మండలాల్లో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారని పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కావలి రూరల్ మండలం గౌరవరం, సర్వాయపాళెం, బోగోలు పాతబిట్రగుంట, దగదర్తి మండలంలో ఆయన పర్యటన ఉంటుందన్నారు. రైతుల కష్టాలను తెలుసుకుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. -
తెలుగుజాతి విచ్ఛిన్నానికి కుట్ర
కావలి, న్యూస్‌లైన్ : తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న రాజకీయ నేతల్లో ఒకేఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. మిగిలిన రాజకీయ నాయకులు సమైక్యాంధ్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, రాష్ట్రం సమైక్యంగా ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ప్రతాప్‌కుమార్‌రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కావలి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలుగు బిడ్డను నిట్టనిలువునా చీల్చాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. సమైక్యం కోసం యూపీఏపై తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. అంతకు ముందు ట్రంకురోడ్డులోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి, తహశీల్దార్ కార్యాలయం సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ పాండురంగారెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ నాయకుడు పొనుగోటి శ్రీనివాసులురెడ్డి, కావలి పట్టణ, రూరల్, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాలకు చెందిన నేతలు, వివిధ కళాశాలలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
తెలుగుతేజం పొట్టిశ్రీరాములు
కావలి, న్యూస్‌లైన్: తెలుగు వారికి ప్రత్యేక రా ష్ట్రం కావాలంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పొట్టిశ్రీరాములు పోరాటం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బోగోలు మండలంలోని జువ్వలదిన్నెలో ఉన్న పొట్టిశ్రీరాములు స్మారక భవనం వరకు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. సుమారు 35 కిలోమీటర్ల మేర జోరువర్షంలోనూ ర్యాలీ సాగింది. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ తెలుగుజాతి కీ ర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత పొట్టిశ్రీరాములదన్నారు. ఆయన ఆత్మార్పణతో ఏర్పడిన రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం, కొన్ని పార్టీలు కలిసి విచ్ఛిన్నం చే సేందుకు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యశంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని చూ సి ఢిల్లీ పీఠం వణికిందన్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టడంతో పాటు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకట నలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ సర్పంచ్‌లతో తీర్మానాలు చేయించి కేంద్రప్రభుత్వానికి పంపుతామన్నారు. 6,7 తేదీల్లో 48 గంటల పాటు రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు. స్వార్థం తగదు కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం తెలుగుజాతిని విడగొట్టే ప్రయత్నం చేయడం తగదని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నా రు. అన్నదమ్ముల్లా కలిసివున్న తెలుగు ప్రజల ను విడగొట్టాలనుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోకుండా సమైక్యరాష్ట్రం కోసం పోరాడాలని హిత వు పలికారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు మాత్రమే తమ పదవులను త్యాగం చేశారని చెప్పారు. వరద బాధితులను ఆదుకునేం దుకు వెళ్లిన వైఎస్ విజయమ్మను ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కొందరు అడ్డుకోవడం తగదన్నారు. వారి చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, ఖా జావళి, వహీద్‌బాషా, కావలి రూరల్ మండల కన్వీనర్ చింతంబాబుల్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు వెంకట్రావు, మా మిడాల రామకృష్ణ, కావలి షాహుల్ హమీద్, నాయకులు తిరివీధి ప్రసాద్, నరసింహ, నవాజ్‌ఖాన్, డేగ రాము, కలికి ప్రభాకర్‌రెడ్డి, శ్రీని వాసులరెడ్డి, పద్మనాభరెడ్డి, చీదెళ్ల కిషోర్, కోటేశ్వరరావు, శ్రీను, నాగేశ్వరమ్మ, ఆసీఫా, పరుసు మాల్యాద్రి పాల్గొన్నారు.