కావలి, న్యూస్‌లైన్: తెలుగు వారికి ప్రత్యేక రా ష్ట్రం కావాలంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పొట్టిశ్రీరాములు పోరాటం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు.
అనంతరం ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బోగోలు మండలంలోని జువ్వలదిన్నెలో ఉన్న పొట్టిశ్రీరాములు స్మారక భవనం వరకు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. సుమారు 35 కిలోమీటర్ల మేర జోరువర్షంలోనూ ర్యాలీ సాగింది. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ తెలుగుజాతి కీ ర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత పొట్టిశ్రీరాములదన్నారు. ఆయన ఆత్మార్పణతో ఏర్పడిన రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం, కొన్ని పార్టీలు కలిసి విచ్ఛిన్నం చే సేందుకు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యశంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని చూ సి ఢిల్లీ పీఠం వణికిందన్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టడంతో పాటు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకట నలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ సర్పంచ్‌లతో తీర్మానాలు చేయించి కేంద్రప్రభుత్వానికి పంపుతామన్నారు. 6,7 తేదీల్లో 48 గంటల పాటు రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు.
స్వార్థం తగదు
కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం తెలుగుజాతిని విడగొట్టే ప్రయత్నం చేయడం తగదని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నా రు. అన్నదమ్ముల్లా కలిసివున్న తెలుగు ప్రజల ను విడగొట్టాలనుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోకుండా సమైక్యరాష్ట్రం కోసం పోరాడాలని హిత వు పలికారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు మాత్రమే తమ పదవులను త్యాగం చేశారని చెప్పారు. వరద బాధితులను ఆదుకునేం దుకు వెళ్లిన వైఎస్ విజయమ్మను ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కొందరు అడ్డుకోవడం తగదన్నారు.
వారి చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, ఖా జావళి, వహీద్‌బాషా, కావలి రూరల్ మండల కన్వీనర్ చింతంబాబుల్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు వెంకట్రావు, మా మిడాల రామకృష్ణ, కావలి షాహుల్ హమీద్, నాయకులు తిరివీధి ప్రసాద్, నరసింహ, నవాజ్‌ఖాన్, డేగ రాము, కలికి ప్రభాకర్‌రెడ్డి, శ్రీని వాసులరెడ్డి, పద్మనాభరెడ్డి, చీదెళ్ల కిషోర్, కోటేశ్వరరావు, శ్రీను, నాగేశ్వరమ్మ, ఆసీఫా, పరుసు మాల్యాద్రి పాల్గొన్నారు.
తెలుగుతేజం పొట్టిశ్రీరాములు
Published Sat, Nov 2 2013 5:36 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM
Advertisement
Advertisement