Murlidhar
-
రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు
సాక్షి, నెల్లూరు : రుణమాఫీపై రోజుకో తప్పుడు ప్రకటన చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ విమర్శించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చారన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దంటూ ఆయన రైతులను రెచ్చగొట్టిన సందర్భాలున్నాయన్నారు. బాబు హామీలను నమ్మి జనం ఓట్లేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలను, డ్వాక్రా మహిళలను వంచిస్తున్నారని మేరిగ మండిపడ్డారు. జూన్ ప్రారంభానికి రైతులకు ఖరీఫ్ ప్రారంభమైందన్నారు. అప్పటికే పాతబకాయిలు చెల్లించి బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు పొందాల్సి ఉందన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారన్నారు. అయినా బాబు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మేరిగ విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు రీ షెడ్యూల్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారని మేరిగ విమర్శించాడు. చంద్రబాబు చెప్పినట్టు రీషెడ్యూల్ ద్వారా రుణాలు అందించే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయన్నారు. ఇక డ్వాక్రా రుణాల పరిస్థితి ఇంతకు తక్కువేమీ కాదన్నారు. పేరుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పినా దీనిపై కూడా స్పష్టత లేదన్నారు. డ్వాక్రా రుణాలు రీ షెడ్యూల్ చేసే పరిస్థితి లేదని మేరిగ చెప్పారు. ఈ నెల చివరకు పంటల బీమా గడువు ముగుస్తుందన్నారు. ఇంతలోపు రైతులు రుణాలు పొందకపోతే భవిష్యత్‌లో పంటలు నష్టపోయినా బీమా వర్తించదన్నారు. ఇప్పటికైనా బాబు అబద్ధాలు మాని చిత్తశుద్ధితో అన్నదాతను ఆదుకునేందుకు ప్రయత్నించాలని మేరిగ మురళీధర్ హితవు పలికారు. రైతులకు అన్యాయం జరగకూడదని తమ పార్టీ ఆందోళనలకు దిగిందని మేరిగ చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పాండురంగారెడ్డి పాల్గొన్నారు. -
ఇరాక్‌లో నరకాన్ని చూశాము
ఆర్మూర్ : ఇరాక్‌లో ప్రత్యక్ష నరకాన్నే చూసామని పలువురు బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. మూడు రోజుల క్రితం ఇరాక్‌ను వచ్చిన నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన ఈర నరేష్, ఉప్పులూర్కు చెందిన ఈర్నాల రవి, గాండ్లపేటకు చెందిన బాలకృష్ణ ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడుతో కలిసి ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని గల్ఫ్ బాధితుల సేవా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏజెంటు చేతిలో మోసపోయిన తీరు, ఇరాక్‌లో పడ్డ కష్టాలను వివరించారు. నిజామాబాద్‌కు చెందిన రాంగోపాల్‌రెడ్డి అనే ఏజెంటు ఇరాక్‌లో ఉంటున్నాడు. ఇతనికి తెలంగాణ జిల్లాలలో సుమారు 50 మంది సబ్ ఏజెంట్లు ఉన్నారు. అందులో నిజామాబాద్‌కు చెందిన మురళీధర్, అర్గుల్ చారిల ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఇటీవల ఇరాక్‌కు కూలీలుగా వెళ్లారు. ప్రతీ ఒక్కరు సబ్ ఏజెంట్లకు రూ. ఒక లక్ష 50 వేల వరకు చెల్లించారు. ఇరాక్‌లో ఆఫీస్‌బాయ్ తదితర తేలిక పాటి పనులకు ప్రతీ నెల రూ. 30 వేల వరకు జీతం వస్తుందని ఏజెంట్లు నమ్మబలికారు. దీంతో అప్పులు చేసి మరీ వారు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి ఇరాక్‌కు చేరుకున్నారు. ఇరాక్‌కు వెళ్తే గాని తాము మోసపోయామని తెలియలేదని వారు వాపోయారు. ఇరాక్‌కు చేరుకున్న వారినందరినీ సుమారు 50 మందిని ఒకే హాల్లో నిర్బంధించారన్నారు. చెప్పిన పని, జీతం లేకపోగా ఏజెంట్లు తమపై దాడికి సైతం పాల్పడేవారని ఆవేదన వ్యక్తం చేసారు. మార్చి 30న ఇరాక్ వెళ్లిన ఈర నరేష్ మాట్లాడుతూ తనను ఆఫీస్ బాయ్ ఉద్యోగం అని తీసుకెల్లి ఫ్యాక్టరీలో కూలీగా చేర్చారన్నాడు. తాను గ్రామానికి తిరిగి వెల్లిపోతానంటే అదనంగా రూ. 60 వేలు చెల్లించాలని ఇబ్బందులు పెట్టారన్నాడు. ఈర్నాల రవి మే 12న ఇరాక్ వెళ్లగా కంపెనీ విజా కాకుండా విజిట్ విజాపై తీసుకెళ్లారు. పని లేకపోవడంతో ఇదేంటని ప్రశ్నిస్తే సుమారు రెండు గంటల పాటు తనను బాత్రూంలో బంధించారని ఆవేదన వ్యక్తం చేసాడు. బాలకృష్ణ హోటల్లో వెయిటర్ పని అని ృెపితే నమ్మి ఏప్రిల్ 11న ఇరాక్‌కు వెళ్లగా అక్కడి లాడ్జిలో ఉంచి పని చూపించకపోవడంతో ఏజెంట్ల బారి నుంచి తప్పించుకొని బయటికి వచ్చానన్నారు. దీంతో ఇరాక్ పోలీలు పట్టుకొని వారం రోజుల పాటు చిత్ర వధ చేసారన్నాడు. తమతో పాటు చాల మంది తెలుగు వారు ఏజెంట్ల మోసం కారణంగా ఇరాక్‌లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫ్లైట్ టికెట్‌కు డబ్బులున్న వారు తిరిగి వస్తుండగా ఆ డబ్బులు సైతం లేని వారు అక్కడే ఇబ్బందులు పడుతూ ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటున్నారని వివరించారు. ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు మాట్లాడుతూ ఏజంట్ల చేతుల్లో మోసపోయి ఇరాక్‌లో కష్టాలు పడుతున్న తెలుగు వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే వారిని కాపాడాలన్నారు. ఇప్పటికే రెండు నుంచి మూడు వేల మంది తెలుగు వారు ఇరాక్‌లో అంతర్యుద్ధం, ఏజంట్ల మోసాల కారణంగా కష్టాలు పడుతున్నారన్నారు. అధికారులను ఇరాక్‌కు పంపించి బాధితులకు ఉచితంగా విమానం టికెట్లు కొనుగోలు చేసి వారిని స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఇలాంటి బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఏజంట్ వ్యవస్థను రద్దు చేసి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన వారికి పావలా వడ్డీతో రుణాలు అందజేసి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ముత్యాల మనోహన్‌రెడ్డి ఉన్నారు. -
కవ్వింపు చర్యలను సహించం
సాక్షి, నెల్లూరు: అధికారం ఉంది కదా అని టీడీపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ హెచ్చరించారు. కవ్వింపు చర్యలకు దిగి వైఎస్సార్సీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. స్థానిక నెల్లూరు (టౌన్), చిట్టమూరు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులపై వేటుపడింది. చిట్టమూరు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, కార్యాలయం సూపరింటెండెంట్ జ్ఞానానందం, విస్తరణాధికారి(ఈవోపీఆర్డీ) వీరబ్రహ్మంలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీకాంత్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఉద్యానశాఖ ఏడీ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్‌లోని ఆశాఖ కమిషనర్కునివేదిక పంపారు. ఈయనపై కూడా ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. గతనెలలో ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ప్రకటించేందుకు ఈనెల 13వ తేదీన కౌంటింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఒక కట్టకు సంబందించి ఓట్లను లెక్కించకుండానే అధికారులు ఫలితాలు ప్రకటించేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వెయ్యిఓట్లు లెక్కించలేదని ప్రచారం జరుగుతోంది. ఈవిషయమై సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలంటూ ఈనెల 15వ తేదీన కలెక్టర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికారులు కావాలనే పక్షపాతంతో తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. లెక్కింపు సమయంలో ఎంపీడీఓ ఏక పక్షంగా వ్యవహరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే ఏజే సీని విచారణకు ఆదేశించారు. ఆయన పరిశీలించి శనివారం కలెక్టర్‌కు నివేదిక పంపారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని, ఓట్లు లెక్కింపులో చిన్నపొరపాటు వల్ల ఒక కట్టను పక్కన పెట్టి మరిచి పోయారని ఎన్నికల సిబ్బంది ఏజేసీ రాజ్‌కుమార్‌కు వివరించినట్టు తెలిసింది. ఇది కావాలని చేయలేదని, పొరపాటున జరిగిందని అధికారులు ఏజేసీ వద్ద వాపోయినట్టు సమాచారం. పరిశీలించిన ఏజేసీ మాత్రం ఎన్నికల విధుల్లో సిబ్బంది అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నారు. దీనిని ఆధారంగా కలెక్టర్ వెంటనే ఆ అధికారులపై వేటు వేశారు. -
గ్రామ బహిష్కరణ ఆటవికం
సాక్షి, నెల్లూరు : అల్లూరు మండలం ఇస్కపల్లి సర్పంచ్, మత్స్యకార బీసీ మహిళ, గర్భణి అయిన బుజ్జంగారి మమత వైఎస్సార్సీపీలో చేరిందన్న అక్కసుతో టీడీపీ నేతలైన బీద సోదరులు దురాయిని అడ్డం పెట్టుకుని గ్రామబహిష్కరణ చేయడం వారి ఆటవిక రాజ్యానికి ప్రతీకని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతుందన్నారు. సోమవారం గ్రామ బహిష్కరణకు గురైన సర్పంచ్ మమత, ఆమె భర్త బాబు, అల్లూరు సర్పంచ్ చంద్రలీలమ్మ తదితరులతో కలిసి మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన మొదలైన కొన్ని గంటల్లోనే ఇస్కపల్లి పంచాయతీలో దారుణం జరగడం అమానుషమన్నారు. ఇది సభ్యసమాజం తలదించుకునే చర్యని ఆయన పేర్కొన్నారు. ఇస్కపల్లి పంచాయతీ బీసీలకు రిజర్వు కాగా మత్స్యకార బీసీ మహిళ సర్పంచ్‌గా ఎన్నికయ్యారన్నారు. అయితే బీద సోదరుడైన గిరిధర్ ఉప సర్పంచ్‌గా ఎన్నికై తానే ఏక పక్షంగా చెలాయించాడని మేరిగ చెప్పారు. ఈ నేపథ్యంలో మహానేత వైఎస్సార్ పథకాలకు ఆకర్షితురాలైన సర్పంచ్ కుటుంబం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని తలచి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారన్నారు. దీన్ని సహించలేని బీద సోదరులు గ్రామ పెద్దలైన కొందరు మత్స్యకారులను తమవశం చేసుకుని దురాయిని అడ్డం పెట్టి సర్పంచ్ మమతకు గ్రామ బహిష్కరణ శిక్ష విధించడమే కాక ఆమె అత్త పోలమ్మ, మామ తాతయ్యను గుడిలో నిర్బంధించడం దారుణమని మేరిగ మండిపడ్డారు. ఇప్పటికే ఆ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని, ఇళ్లు, పొలాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారని మేరిగ మురళీ పేర్కొన్నారు. వారికి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ బాధితులకు అండగా నిలిచి ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. నిండు గర్భిణికి గ్రామ బహిష్కరణ శిక్షా?: అనిత నిండు గర్భిణి మమతకు బీద సోదరులు గ్రామ బహిష్కరణ శిక్ష విధించడం దారుణమని, ఇది క్షమించరాని నేరమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేరిగ మురళీధర్‌తో పాటు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం నియంతృత్వ పోకడలతో బీద సోదరులు బీసీ మత్స్యకార మహిళ అని చూడకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అమానుషమన్నారు. తక్షణం రాష్ట్ర, జిల్లా అధికారులు బీద సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు సైతం పారిపోతున్నారని, వారి సంగతి పట్టించుకోని ఆ పార్టీ నేతలు బీసీ మత్స్యకార మహిళ పార్టీని వీడితే దారుణానికి ఒడిగట్టడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సర్పంచ్ చంద్రలీలమ్మ, వార్డు సభ్యులు శేషారెడ్డి, వసంతమ్మ, రమణమ్మ, సుహాసిని, లలితమ్మ, బుజ్జంగారి మమత, ఉండ్రాళ్ల ఉమ, సర్పంచ్ భర్త బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి జిల్లా వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఏకపక్షంగా ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన నిరసనదీక్షకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ తెలిపారు. ఆయన శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి 500 మంది నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 10 గంటలకు రేణిగుంట నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు. -
ఎన్నికలకు సిద్ధం
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. స్థానిక మాగుంటలేఅవుట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మహానేత వైఎస్సార్ తన హయాంలో జనరంజక పాలన అందించారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్ పార్టీని స్థాపించారన్నారు. వైఎస్సార్సీపీలో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. జిల్లాలో బీసీ నాయకులకు జగన్ గౌరవప్రదమైన స్థానం కల్పించినట్టు మేరిగ చెప్పారు. డాక్టర్ నాగేంద్రకుమార్ యాదవ్‌కు పార్టీ రాష్ట్ర బీసీ కమిటీలో చోటు కల్పించారన్నారు. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు వైఎస్ జగన్‌తో పాటు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బీసీ కమిటీ సభ్యుడు డాక్టర్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాలు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. జిల్లాలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు రాకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కాలర్షిప్లు మంజూరు చేసేలా ప్రభుత్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు నాంగేంద్రను పలువురు అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చేవురు వెంకటరామిరెడ్డి, కె మధుబాబు, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగుతేజం పొట్టిశ్రీరాములు
కావలి, న్యూస్‌లైన్: తెలుగు వారికి ప్రత్యేక రా ష్ట్రం కావాలంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పొట్టిశ్రీరాములు పోరాటం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బోగోలు మండలంలోని జువ్వలదిన్నెలో ఉన్న పొట్టిశ్రీరాములు స్మారక భవనం వరకు బైక్ ర్యాలీ నిర్వహిం చారు. సుమారు 35 కిలోమీటర్ల మేర జోరువర్షంలోనూ ర్యాలీ సాగింది. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ తెలుగుజాతి కీ ర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత పొట్టిశ్రీరాములదన్నారు. ఆయన ఆత్మార్పణతో ఏర్పడిన రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం, కొన్ని పార్టీలు కలిసి విచ్ఛిన్నం చే సేందుకు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యశంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని చూ సి ఢిల్లీ పీఠం వణికిందన్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టడంతో పాటు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకట నలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ సర్పంచ్‌లతో తీర్మానాలు చేయించి కేంద్రప్రభుత్వానికి పంపుతామన్నారు. 6,7 తేదీల్లో 48 గంటల పాటు రహదారులను దిగ్బంధిస్తామని వెల్లడించారు. స్వార్థం తగదు కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం తెలుగుజాతిని విడగొట్టే ప్రయత్నం చేయడం తగదని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నా రు. అన్నదమ్ముల్లా కలిసివున్న తెలుగు ప్రజల ను విడగొట్టాలనుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోకుండా సమైక్యరాష్ట్రం కోసం పోరాడాలని హిత వు పలికారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు మాత్రమే తమ పదవులను త్యాగం చేశారని చెప్పారు. వరద బాధితులను ఆదుకునేం దుకు వెళ్లిన వైఎస్ విజయమ్మను ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కొందరు అడ్డుకోవడం తగదన్నారు. వారి చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఎస్.పాండురంగారెడ్డి, ఖా జావళి, వహీద్‌బాషా, కావలి రూరల్ మండల కన్వీనర్ చింతంబాబుల్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు వెంకట్రావు, మా మిడాల రామకృష్ణ, కావలి షాహుల్ హమీద్, నాయకులు తిరివీధి ప్రసాద్, నరసింహ, నవాజ్‌ఖాన్, డేగ రాము, కలికి ప్రభాకర్‌రెడ్డి, శ్రీని వాసులరెడ్డి, పద్మనాభరెడ్డి, చీదెళ్ల కిషోర్, కోటేశ్వరరావు, శ్రీను, నాగేశ్వరమ్మ, ఆసీఫా, పరుసు మాల్యాద్రి పాల్గొన్నారు.