నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. స్థానిక మాగుంటలేఅవుట్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మహానేత వైఎస్సార్ తన హయాంలో జనరంజక పాలన అందించారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్ పార్టీని స్థాపించారన్నారు. వైఎస్సార్‌సీపీలో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. జిల్లాలో బీసీ నాయకులకు జగన్ గౌరవప్రదమైన స్థానం కల్పించినట్టు మేరిగ చెప్పారు. డాక్టర్ నాగేంద్రకుమార్ యాదవ్‌కు పార్టీ రాష్ట్ర బీసీ కమిటీలో చోటు కల్పించారన్నారు. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు వైఎస్ జగన్‌తో పాటు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బీసీ కమిటీ సభ్యుడు డాక్టర్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
బడుగు, బలహీన వర్గాలు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. జిల్లాలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు రాకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసేలా ప్రభుత్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు నాంగేంద్రను పలువురు అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చేవురు వెంకటరామిరెడ్డి, కె మధుబాబు, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధం
Published Mon, Jan 20 2014 5:09 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM
Advertisement
Advertisement