సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఏకపక్షంగా ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన నిరసనదీక్షకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ తెలిపారు. ఆయన శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి 500 మంది నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 10 గంటలకు రేణిగుంట నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీకి జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు
Published Sat, Feb 15 2014 2:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement