కావలి: కావలి నియోజకవర్గంలో నెల కొన్న సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసుల సాయంతో ప్రభుత్వం భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన పట్టణ బంద్ శనివారం విజయవంతమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టణానికి చేరుకుని నిరసన ర్యాలీని నిర్వహించాయి.
పట్టణంలో దుకాణాలు, విద్యాసంస్థలు, స్కూళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పలుప్రభుత్వ కార్యాలయాలను వైఎస్సార్‌సీపీ నాయకులు మూయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి బ్రిడ్జిసెంటర్‌లో రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోను అడ్డుకునేందుకు కావలి డీఎస్పీ మోహన్‌రావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రాస్తారాకో చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రెండుగంటల సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భారీ ఎత్తున తోపులాట జరిగింది. నేతలంతా అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యాదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శిలు గంధం ప్రసన్నాంజనేయులు, అళహరి చిట్టిబాబు, బోగోలు మండల కన్వీనర్ తూపిరి పెంచలయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, నాయకులు నెల్లూరు వెంకటేశ్వర్లురెడ్డి, జనిగర్ల మహేంద్రయాదవ్, కుందుర్తి కామయ్య, యల్లంటి ప్రభాకర్, వేగూరి చిన్నపుల్లయ్య, గుడ్లూరు మాల్యాద్రి, నున్నావెంకట్రావు, కలికి ప్రభాకర్‌రెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, చిమ్మిలి అంకబాబు, పుదూరు శ్రీనివాసులు, నాగేశ్వరమ్మ, ఉస్మాన్‌షరీప్, కరేటి దైవాదీనం తదితరులు ఉన్నారు.
బంద్ సంపూర్ణం
Published Sun, Feb 22 2015 3:40 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement