కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
Published Tue, May 2 2017 12:02 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఉద్ధృతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక 131వ దినోత్సవంలో భాగంగా సోమవారం కర్నూలు సీక్యాంప్ సెంటర్‌లో పార్టీ ట్రేడ్‌యూనియన్ నగర అధ్యక్షుడు కటారి సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హఫీజ్ ఖాన్‌తో పాటు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ నాయకులు రిజ్వాన్ ఖాన్, నజీర్‌అహ్మద్ ఖాన్, పేలాల రాఘవేంద్ర, కరుణాకర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, ఏసన్న, కిశోర్, సంపత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement